Jabardasth 10 వేలు ఇస్తా.. అనసూయను సెట్ చేయి.. పుష్ప పేరెడీ స్కిట్‌లో హైపర్ ఆది రచ్చ

పాపులర్ జబర్దస్త్ షో ద్వారా సినీ పరిశ్రమకు, తెలుగు వినోద రంగానికి ప్రతిభావంతులైన హాస్య నటుుల, కమెడియన్లు పరిచయమయ్యారంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలా తెలుగు వినోద రంగంలో అద్భుతంగా రాణిస్తున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. పేరెడీ చేయాలన్నా.. గుక్క తిప్పుకోకుండా పంచులు విసరాలన్నా ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినిమాల్లో ట్రెండింగ్‌గా మారే సన్నివేశాలను పేరడి చేయడంలో తనకు మించిన వారుండరేమో అనిపిస్తుంది. తాజాగా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో పుష్ప పేరడిని తనదైన శైలిలో ఎలా చేశారంటే...

రోజా, అనసూయపై హైపర్ ఆది..

రోజా, అనసూయపై హైపర్ ఆది..

జబర్దస్త్ తాజా ఎపిసోడ్‌లో పుష్ప పేరడి స్కిట్‌లో హైపర్ ఆదితోపాటు ఈ చిత్రంలో కేశవ క్యారెక్టర్‌ను పోషించిన జగదీష్ కూడా పాల్గొన్నారు. ఎప్పటిలానే జడ్జీలుగా మనో, రోజా‌తోపాటు హోస్ట్ అనసూయ పాల్గొన్నారు. గతంలో మాదిరిగానే స్కిట్ ఆసాంతం అనసూయపై సెటైర్లు వేస్తూ హైపర్ ఆది తన స్కిట్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లారని అనిపిస్తుంది. పుష్ప గెటప్‌లో స్టేజ్‌పైకి వస్తూ.. మనో గారు.. నీ యవ్వ తగ్గేదేలే.. రోజా గారు.. అనసూయ గారు.. తగ్గేదేలే అంటూ కామెంట్ చేశాడు. అయితే పక్కనే ఉన్న కమెడియన్.. మనో గారికి నీ యవ్వ అన్నావు.. రోజా, అనసూయకు ఎందుకు అనలేదంటే.. అవ్వలకు నీ యవ్వ అనడం అవసరమా అంటూ ఆది పంచ్ ఇచ్చారు.

హైపర్ ఆదిపై పుష్ప జగదీష్ పంచులతో

హైపర్ ఆదిపై పుష్ప జగదీష్ పంచులతో

నా పేరు కేశవ. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశా. జబర్దస్త్‌లో నీ పక్కన చేస్తున్నా అంటూ జగదీష్ అన్నాడు. దాంతో ఫుల్ లెంగ్త్ చేస్తున్నానని అనుకొంటున్నావు. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక.. మొత్తం ఆది ఉన్నాడు.. నేను ఎక్కడ అంటూ ఫుల్ తాగి పడుకొంటావు అని ఆది అన్నాడు. దాంతో రోజా అవును.. అదే జరుగుతుంది అంటూ రోజా కామెంట్ చేసింది. అయితే కేశవ.. పుష్ప గెటప్ వేసాను కదా.. ఎలా ఉంది అంటే.. అల్లు అర్జున్ వేస్తే కిర్రాక్‌గా ఉంది.. నీవు వేస్తే చాలా చిరాకుగా ఉంది అంటూ జగదీస్ తనదైన శైలిలో సెటైర్ వేశాడు.

పదివేలతో పెద్ద పూజ అంటూ

పదివేలతో పెద్ద పూజ అంటూ


ఇక అనసూయ‌ను హైపర్ ఆది చూస్తూ.. కేశవ.. అనసూయ చూస్తున్నది అంటే.. ఇంకా ఏం చేస్తున్నది అని జగదీష్ అడిగాడు.. నవ్వుతుండాదిరా అని ఆది జవాబిచ్చారు... దాంతో వెయ్యి రూపాయలు ఇస్తే అలానే చేస్తుంది అని జగదీష్ సమాధానం చెప్పాడు. వెయ్యి రూపాయలు కాదు.. పోతే పదివేలు పోనియ్యు.. ఏదైనా పెద్ద పూజ ప్లాన్ చేయి.. అని హైపర్ ఆది రొమాంటిక్ అనగానే.. అనసూయ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చింది.

 నీ మాదిరిగా వేరే వాళ్లపై కాళ్లు అంటూ

నీ మాదిరిగా వేరే వాళ్లపై కాళ్లు అంటూ


పుష్పలో అల్లు అర్జున్ కాలు మీద కాలు వేసుకొనే సీన్‌ను హైపర్ ఆది క్రియేట్ చేశాడు. ఒక కమెడియన్ వచ్చి ఏంది రా కాలు మీద కాలు వేసుకొని కూర్చొన్నావు అని అంటే.. ఈ కాలు నాది.. ఈ కాలు నాదే.. నా కాలు మీద నా కాలు వేసుకొన్నాను. నీ లాగా ఎవరిపైనా కాలు వేశానా అంటూ హైపర్ ఆది పంచ్ విసిరారు. అంతేకాకుండా ఆ కమెడియన్‌ను ఉద్దేశించి.. వీడిని చూస్తే కొరియా వాడిలా ఉన్నాడు.. వీడిని కొరియోగ్రాఫర్ ఎవడు చేశాడురా అంటూ హైపర్ ఆది సెటైర్ వేయగానే.. అందరూ గొల్లున నవ్వారు.

రైజింగ్ రాజుపై హైపర్ ఆది పంచులు

రైజింగ్ రాజుపై హైపర్ ఆది పంచులు

ఇక రైజింగ్ రాజు పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చారు. స్టేజ్ పైకి వస్తూనే.. కట్టెలు ఎక్కడ.. కట్టెలు ఎక్కడ అంటూ అరిచాడు. దాంతో నీ ఇంటి ముందు కట్టెలు పేర్చాం. ఇక నీవు వెళ్లి వాటిపై పడుకోవడమే అంటూ హైపర్ ఆది పంచ్ వదిలాడు. దాంతో సరుకు ఎక్కడ దాచావో చెప్పురా అంటూ హైపర్ ఆది చొక్కాను రాజు పట్టుకొంటే.. నేను చెప్పేస్తే.. నా టీమ్ లీడర్ చంపేస్తాడు అని సమాధానం ఇచ్చాడు. దాంతో ఎవడురా మీ టీమ్ లీడర్ అంటే.. నేను అంటూ తనదైన శైలిలో హైపర్ ఆది కౌంటర్ ఇచ్చాడు.

ఊ అంటావా? ఊఊ అంటావా అంటూ

ఊ అంటావా? ఊఊ అంటావా అంటూ

ఇలా ఆద్యంతం పుష్ప పేరడి స్కిట్ పంచులతో పేలిపోయింది. ఇక ఊ అంటావా.. ఊఊ అంటావా అనే పాటను ప్లే చేశాడు. పాటకు స్టెప్పులేసిన ఆది.. ఆర్టిస్టుతో మాట్లాడుతూ.. ఊ అంటావా.. అని అడిగితే.. ఊఊ అంటాను అని సమాధానం ఇచ్చింది. దాంతో ఊ అనొచ్చుగా అని బతిమిలాడుకొన్నాడు. అయితే సినిమాలో ఈ పాట ఇప్పుడు రాదు కదా అంటూ జగదీష్ అంటే.. మన స్కిట్‌లో ఎప్పుడంటే.. అప్పుడు వస్తుంది.. అని హైపర్ ఆది సమాధానం ఇచ్చాడు. ఈ స్కిట్‌లో పలు మార్లు పాటను రిపీట్ చేసి హైపర్ ఆది మంచి వినోదాన్ని పండించాడు.

 పుష్ప పేరేడీ స్కిట్‌లో

పుష్ప పేరేడీ స్కిట్‌లో

ఫుష్ప పేరేడి స్కిట్‌లో ఊ అంటావా పాటను పదే పదే రిపీట్ చేయడంతో.. ఎన్నిసార్లు ఈ పాటను వేస్తావు అంటూ డ్యాన్సర్ అడిగితే.. నీవు ఊ అనేంత వరకు ఊఊ పాటను వేస్తూనే ఉంటాం. నువ్వే ఎప్పుడు ఊ అంటావా అనేది నిర్ణయం తీసుకోవాలి అని హైపర్ ఆది కామెంట్ చేశాడు. పక్కనే ఉన్న అజర్‌ను చూపించి.. స్కిట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాడో చూడు... అంటే స్కిట్‌ను కాదు.. నిన్ను ఎలా బయటకు తీసుకెళ్లాలని అజర్ చూస్తున్నాడు అంటూ హైపర్ ఆది సెటైర్ వేశాడు. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X