Remuneratiion: అనసూయకు కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్.. ఏ సినిమాకో తెలుసా?

తెలుగు వెండితెర దగ్గర బుల్లితెరపై కనిపించిన నటీనటులు క్లిక్ అవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది అని చెప్పాలి. కాగా కొందరు బుల్లితెరపై పెద్ద స్టార్స్ అయినప్పటికీ వారికి వెండితెరపై మాత్రం అంత యాక్సెప్టెన్స్ రాదు దీనితో సిల్వర్ స్క్రీన్ స్ట్రగుల్స్ మాత్రం కొందరికి కొనసాగుతూనే ఉంటాయి.

కాగా ఇలా తెలుగు బుల్లితెర నుంచి వెండితెర మీదకి వచ్చి సక్సెస్ అయ్యిన వారు చాలా తక్కువ మందే కనిపిస్తే ఆ తక్కువ మందిలో కూడా తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకరింగ్ లో కొత్త ఒరవడి తీసుకొచ్చిన టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకామె అని చెప్పవచ్చు. కాగా జబర్దస్త్ తో తెలుగులో బాగా పాపులర్ అయ్యిన ఈ నటి అంతకు ముందు కూడా పలు సినిమాలు చేసింది కానీ స్మాల్ స్క్రీన్ తర్వాతే అనసూయ ఫేట్ మారింది.

Anasuya bharadwaj gets highest remuneration Here is detailed story

కాగా ఇలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ ల సినిమా రంగస్ధలం సినిమాతో పెద్ద బ్రేక్ అందుకోవడమే కాకుండా ఆ సినిమా దెబ్బతో టాలీవుడ్ ఆడియెన్స్ కి రంగమ్మత్తగా కూడా మారిపోయింది. కాగా ఇపుడు పుష్ప 2 సహా అనేక భారీ సినిమాలు ఆఫర్స్ అందుకుంటున్న ఈ నటి లేటెస్ట్ గా తన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ని అందుకునే రేంజ్ కి వెళ్లినట్టుగా తెలుస్తుంది.

కాగా ఇపుడు అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ లో తన కాల్షీట్స్ కి రోజుకి ఇంత అని తీసుకుంటుందట. కాగా ఇలా పుష్ప 2 కే అత్యధికంగా ఒకటిన్నర నుంచి రెండు లక్షలు ఒకో రోజుకి ఛార్జ్ చేసేదట. కానీ ఇపుడు అంతకు మించిన రెమ్యునరేషన్ తో సినిమా ఆఫర్ అనసూయకి సొంతం అయ్యినట్టుగా ఇపుడు టాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా టాలీవుడ్ లో పెద కాపు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ హీరో విరాట్ కర్ణ తదుపరి భారీ చిత్రం "నాగబంధం" అనే సినిమాలో అనసూయ చాలా ప్రత్యేకమైన పాత్ర కోసం భాగం అయ్యినట్టుగా రీసెంట్ గానే రివీల్ చేసింది. కాగా ఇపుడు ఆ సినిమా కోసమే తన కెరీర్లో హైయెస్ట్ పారితోషికాన్ని ఆమె అందుకుంటున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

Anasuya bharadwaj gets highest remuneration Here is detailed story

కాగా లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈ సినిమాకి అనసూయ రోజుకి 3 నుంచి 4 లక్షలు చొప్పున డిమాండ్ చేయడంతో ఆమెకి అంతకీ నిర్మాతలు ఒప్పుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. సో ఇలా అనసూయ డిమాండ్ టాలీవుడ్ లో నడుస్తుంది అని చెప్పవచ్చు.

కాగా ఇలా రంగమ్మత్త ఫుల్ డిమాండ్ లో కనిపిస్తుండగా ఈ సినిమా కాకుండా ఈమె మరిన్ని సినిమాలు తెలుగులో చేస్తుంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు లో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో ఆమె కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో ఆమె లుక్స్ పై కూడా పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వచ్చాయి.

More from Filmibeat

Read more about: anasuya sukumar pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X