జబర్దస్త్‌కి అనసూయ గుడ్ బై.. అసలు కారణాలు ఇవే!

Recommended Video

Anasuya Bharadwaj To Leave Comedy Show Due To This Reason? || Filmibeat Telugu

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో స్పెషల్ అట్రాక్షన్ యాంకర్ అనసూయనే. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. షో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఆమె ఎన్ని పంచులు విసిరినా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అనసూయను చూసి మురిసిపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. యాంకర్ అయినప్పటికీ తన అందాలతో బుల్లితెర ఆడియన్స్ ని మత్తెక్కించడంలో సక్సెస్ అయింది అనసూయ. దీంతో జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్ అనే స్టేజ్ కి వెళ్లిపోయారు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్. అయితే అనసూయ గురించి తాజాగా వినిపిస్తున్న ఓ వార్త వారిని కలవర పెడుతోంది. వివరాల్లోకి పోతే..

అనసూయ కోసం క్యూ

అనసూయ కోసం క్యూ

హాట్ యాంకర్ గా కొనసాగుతూనే వెండితెరపై కాలుమోపిన అనసూయ ఇక్కడ కూడా ఊహించని విజయం సాధించింది. వెండితెర ప్రేక్షకులు సైతం అనసూయ మాయలో పడిపోయారు. ఎలాంటి పాత్రలో నైనా ఇట్టే ఒదిగిపోతూ యమ అట్రాక్ట్ చేస్తోంది అనసూయ. ఇటీవలే రంగస్థలంలో రంగమ్మత్త గా అనసూయ అభినయం మెప్పించింది. దీంతో ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది.

జబర్దస్త్‌కి అనసూయ గుడ్ బై

జబర్దస్త్‌కి అనసూయ గుడ్ బై

ఈ నేపథ్యంలో అటు సినిమాలు, ఇటు జబర్దస్త్ మెయిన్‌టైన్ చేయాలంటే అనసూయకు డేట్స్ సర్దుబాటు కావడం లేదట. ఇన్ని రోజులు ఈ రెండు ట్రాక్స్ ఎలాగోలా నెట్టుకొచ్చినప్పటికీ ఇక జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పాలనే ఆలోచనకు వచ్చిందట అనసూయ. ఈ విషయాన్ని అనసూయ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించడంతో ఇలా బయటకు వచ్చేసింది.

కొద్ది రోజులైనా లేక పూర్తిగానా..?

కొద్ది రోజులైనా లేక పూర్తిగానా..?

జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ ఉంటేనే ఆ షోకి ఆదరణ. అప్పుడప్పుడూ ఆమె ప్లేస్ లో రష్మీ ఆకట్టుకున్నప్పటికీ.. గత కొంతకాలంగా అనసూయ జోష్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఈమె శాశ్వతంగా జబర్దస్త్ నుంచి తప్పుకుంటుందా? లేక కాస్త కొద్ది రోజులు మాత్రమే విరామం ఇస్తుందా? అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

అనసూయ లేని జబర్దస్త్‌

అనసూయ లేని జబర్దస్త్‌

జబర్దస్త్‌ షోలో స్కిట్లన్నీ ఒకెత్తయితే.. అనసూయ కలరింగ్ మరో ఎత్తు. షో అంతా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కెమెరా కళ్ళు, పంచు డైలాగులు అన్నీ కూడా అనసూయ అందాల పైనే! అలాంటి ఈ హాట్ యాంకర్ లేని జబర్దస్త్‌ ఉహించుకోవడమే కష్టంగా ఉంది. చూడాలి మరి.. అనసూయ లేని జబర్దస్త్‌ వార్తలపై ఆమె స్పందిస్తుందా? లేక సైలెంట్‌గా ఉంటుందా? అనేది.

అనసూయ సినిమాలు

అనసూయ సినిమాలు

ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే.. సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, ఎఫ్ 2, యాత్ర లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకొని ఇప్పుడు 'కథనం' డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X