హైపర్ ఆది వల్లే జబర్దస్త్‌ను వదిలేశా.. లింకులు అంటగడుతారా? అనసూయ షాకింగ్ కామెంట్స్

Photo Courtesy: Mallemala TV

దాదాపు 12 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచుతూ అలరిస్తోంది జబర్దస్త్. ప్రతిభ ఉండి దానిని పదిమందికి ఎలా చూపించాలో తెలియని ఎంతో మందికి జబర్దస్త్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతో మంది వెండితెర, బుల్లితెరపై ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్నారు. హీరోలుగా, కమెడియన్లుగా, హీరోయిన్లుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. తెలుగు నాట ఏ టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ చూసిని అందులో జబర్దస్త్ నుంచి వెళ్లినవారు ఖచ్చితంగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బుల్లితెరపై జబర్దస్త్ సంచలనం
2013లో మల్లెమాల నుంచి పురుడు పోసుకున్న ఈ జబర్దస్త్ కార్యక్రమం ప్రతివారం రెండు రోజుల పాటు ప్రేక్షకులను నవ్వించింది. మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హీరోయిన్ రోజా సెల్వమణిలు జడ్జిలుగా.. అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్‌లు యాంకర్లుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వారం వారం జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ ప్రేక్షకులు ప్రతి గురు, శుక్రవారం టీవీలకు అతుక్కుపోయేవారు. భారీ టీఆర్పీలతో జబర్దస్త్ షో బుల్లితెరపై నెంబర్ వన్‌గా నిలబెట్టడంతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

Anasuya Bharadwaj hints Hyper Aadi is Reason for quitting Jabardasth comedy show

Photo Courtesy: Mallemala TV

గ్లామర్‌తో సెగలు రేపిన అనసూయ
జబర్దస్త్‌లో కమెడియన్లతో పాటు యాంకర్లు ఈ కార్యక్రమానికి ప్లస్ పాయింట్స్‌గా మారారు. అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్‌లు తమ గ్లామర్‌తో ఈ షోకు ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్ తన అందచందాలతో సెగలు రేపింది. శారీ, మోడ్రన్ డ్రెస్ ఇలా ఏదైనా సరే తన అందాన్ని మరింత ఎలివేట్ చేసేది. అనసూయను చూడటానికి కుర్రకారు జబర్దస్త్‌కు ఎగబడేవారు. యాంకరింగ్‌తో పాటు మధ్యలో స్కిట్స్ చేస్తూ తనలోని టాలెంట్‌ను బయటపెట్టారు. పంచ్ డైలాగ్స్ పేల్చడంలోనూ అనసూయ సిద్ధహస్తురాలు. అలా అనసూయ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే అనసూయ అన్నంతగా ముద్ర వేసుకున్నారు.

జబర్దస్త్‌ను ఎందుకు వదిలేసింది?
జబర్దస్త్‌ ద్వారా వచ్చిన ఫేమ్‌తోనే అనసూయ సినిమాల్లో బిజీ అయ్యారు. తనకు సెలబ్రెటీ స్టేటస్‌ను, జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ షోను అనసూయ భరద్వాజ్ విడిచిపెట్టడం చిత్రసీమలో చర్చనీయాంశమైంది. సినిమాల్లో బిజీ కావడం వల్లేనే ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్‌ను వదిలేశారని.. లేదు లేదు మల్లెమాలతో విభేదాల కారణంగానే వెళ్లిపోయారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. అనసూయ వెళ్లిపోయిన తర్వాత కన్నడ నటి సౌమ్యా రావ్, సిరి హనుమంతు తదితరులు యాంకర్లుగా వచ్చారు. కానీ అనసూయ రేంజ్‌ను వీరు అందుకోలేకపోయారు. తాజాగా తాను జబర్దస్త్‌ను వీడటంపై మౌనం వీడారు అనసూయ భరద్వాజ్.

జబర్దస్త్ 12 ఇయర్స్ సెలబ్రేషన్స్
జబర్దస్త్‌కు 12 వసంతాలు నిండుతున్న సందర్భంగా మల్లెమాల స్పెషల్ షో ప్లాన్ చేసింది. జబర్దస్త్ షో ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జడ్జిలుగా, కమెడియన్లుగా, యాంకర్లుగా వ్యవహరించిన అందరినీ ఇందుకోసం పిలిచారు. జబర్దస్త్‌ను వీడిన నాగబాబు సహా అనసూయ ఇతర కమెడియన్లు ఎంట్రీ ఇచ్చారు. రోజా మాత్రం ఎక్కడా కనిపించలేదు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల విడుదల చేసింది. ఇందులో హైపర్ ఆది వల్లే తాను జబర్దస్త్‌ను వీడినట్లుగా అనసూయ ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు.

హైపర్ ఆదిపై అనసూయ సీరియస్
వెళ్లేముందు ఎంతో అడుక్కున్నా.. వద్దు ఆది అని వేడుకున్నా అని అనసూయ వ్యాఖ్యానించింది. నాతో పాటు స్కిట్ చేసి ప్రోత్సహించా.. కానీ నా ఎక్స్‌క్లూజివిటీ యాడ్ కాలేదు, అదే నా ఏడుపు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వెంటనే హైపర్ ఆది మైక్ అందుకుని నువ్వు అమెరికా వెళ్లినా సరే నీకు లింకులు పింపించా అది మన లింక్ అని వ్యాఖ్యానించాడు. ఇలాంటివి మాట్లాడితేనే నేను వెళ్లిపోయింది అని అనసూయ సీరియస్ అయ్యింది. ప్రస్తుతం రంగమ్మత్త వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. అనసూయ- ఆదిల మధ్య ఏం జరిగింది? అతని వల్లే అనసూయ జబర్దస్త్‌‌ను వీడిందా? అన్నది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X