ముద్దు ముచ్చట లేదంటూ అనసూయ హాట్ కామెంట్స్: పట్టించుకోనప్పుడు ప్రేమించడం ఎందుకంటూ!

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. అందులోనూ గ్లామరస్ బ్యూటీలు మరింత ఫాలోయింగ్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ప్రథమ వరుసలో ఉంది అనసూయ భరద్వాజ్. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాలా తక్కువ వ్యవధిలోనే ఊహించిన రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్దు ముచ్చట లేదంటూ అనసూయ హాట్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

అలా మొదలైన కెరీర్.. జబర్ధస్త్‌గా సాగుతూ

అలా మొదలైన కెరీర్.. జబర్ధస్త్‌గా సాగుతూ

చిన్న చిన్న పాత్రల ద్వారా సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అనసూయ. అయితే, వీటి వల్ల ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రమోటర్‌గా చేసింది. ఆ తర్వాత జబర్ధస్త్ అనే కామెడీ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంటర్ అయిందో లేదో.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్‌ను అందుకుంటూ సత్తా చాటిందీ భామ.

సినిమాల్లోకి ఎంట్రీ.. అన్నీ అత్యుత్తమంగానే

సినిమాల్లోకి ఎంట్రీ.. అన్నీ అత్యుత్తమంగానే

జబర్ధస్త్ షో వల్ల అనసూయ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో ఫేమస్ పర్సనాలిటీల్లో ఒకరిగా నిలిచిన ఆమె.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక, రంగస్థలం ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి.

స్పైసీ రోల్.. ఐటం సాంగ్.. అనసూయ హవా

స్పైసీ రోల్.. ఐటం సాంగ్.. అనసూయ హవా

ప్రస్తుతం అనసూయ పలు షోలతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో ఆమె స్పైసీ రోల్‌లో చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఐటం సాంగ్ కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, సునీల్ సినిమాలోనూ నటిస్తోందట.

వీడియోతో విమర్శకుల నోళ్లు మూయించింది

వీడియోతో విమర్శకుల నోళ్లు మూయించింది

బుల్లితెరపై సందడి చేస్తోన్న అనసూయపై తరచూ ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల విడుదలైన 'థ్యాంక్యూ బ్రదర్' టీజర్‌తో ఆమె చాలా మంది నోళ్లు మూయించింది. ర‌మేష్ రాప‌ర్తి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాలో అనసూయ గర్భిణి పాత్రలో నటిస్తోంది. తాజాగా వదిలిన టీజర్‌లో ఆమె చేసిన యాక్టింగ్‌కు చాలా మందే ఫిదా అయిపోతున్నారు.

ముద్దు ముచ్చట లేదంటూ హాట్ కామెంట్స్


జబర్ధస్త్‌ షోలో ప్రతి వారం తనదైన శైలి యాంకరింగ్‌తో సత్తా చాటే అనసూయ.. అప్పుడప్పుడూ కొన్ని స్కిట్లలోనూ నటిస్తోంది. మరీ ముఖ్యంగా హైపర్ ఆది కోసం కొన్ని పాత్రలు చేసింది. ఇందులో భాగంగానే వచ్చే వారం జరగనున్న ఎపిసోడ్‌లో ఆమె అతడికి ప్రియురాలిగా నటించింది. ఈ సందర్భంగా ముద్దు ముచ్చట లేదు అంటూ హైపర్ ఆది పాత్రను ఉద్దేశించి ఆమె కామెంట్స్ చేసింది.

అయితే రా మరి అంటూ రెచ్చిపోయిన ఆది

అయితే రా మరి అంటూ రెచ్చిపోయిన ఆది

రోబో మూవీ స్ఫూఫ్‌తో ఆది స్కిట్ చేశాడు. అందులో అనసూయ.. ఐశ్వర్యరాయ్ పాత్రను పోషించింది. ఇందులో భాగంగా తన ప్రియుడైన ఆదితో 'ముద్దు లేదు.. ముచ్చట లేదు. పట్టించుకోనప్పుడు ప్రేమించడం ఎందుకు' అంటూ నిట్టూర్చింది. దీనికి స్పందించిన ఆది.. 'అయితే రా మరి' అంటూ హగ్ చేసుకునే ప్రయత్నం చేయగా.. స్కిట్‌లోకి రా అంటూ అతడికి గుర్తు చేసిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X