అనసూయ ఏంటి బాబు ఇలా! హెవీ డోస్.. తల్లా? పెళ్ళామా?? అసలు గేమ్ స్టార్ట్

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఇక అసలు గేమ్ మొదలు పెట్టనుందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నితెరపై జబర్దస్త్ బ్యూటీగా వయసులో తేడా లేకుండా అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈమె ఇకపై తల్లా? పెళ్ళామా..? అంటూ మరో హంగామా షురూ చేయబోతోంది. ఆ టైటిల్, అందునా అనసూయ.. అనే సరికి జనాల్లో ఒక్కసారిగా ఆత్రుత నెలకొంది. ఇంతకీ ఈ తల్లా? పెళ్ళామా..? కథేంటి.. వివరాల్లోకి పోతే..

ఆడియన్స్‌కి కొత్త టేస్ట్.. అనసూయ గ్లామర్

ఆడియన్స్‌కి కొత్త టేస్ట్.. అనసూయ గ్లామర్

యాంకరింగ్‌కి గ్లామర్ హంగులు అద్ది బుల్లితెర ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ రుచి చూపించింది అనసూయ భరద్వాజ్. ముద్దు ముద్దు మాటలే కాదు, చిట్టి పొట్టి డ్రెస్సులతో చిన్నితెరపై గ్లామర్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించింది. తన షో అంటే చాలు చిన్నా, పెద్దా అంతా టీవీలకు అతుక్కుపోయేలా జబర్దస్త్ కిక్కిస్తూ దూసుకుపోతోంది అనసూయ.

జబర్దస్త్ లోకల్ గ్యాంగ్.. అనసూయకు ప్రతిరోజూ పండగే

జబర్దస్త్ లోకల్ గ్యాంగ్.. అనసూయకు ప్రతిరోజూ పండగే

ఈ మేరకు ఇప్పటికే ఈటీవీలో జబర్దస్త్ సందడి చేస్తూనే జీ తెలుగులో లోకల్ గ్యాంగ్ షోకి న్యాయనిర్ణేతగా వస్తూ మాంచి ఫామ్‌లో ఉంది అనసూయ. అంతే కాకుండా అదే ఈటీవీలో 'ప్రతిరోజూ పండగే' లాంటి షో లోనూ అలరిస్తోంది. దీంతో అనసూయ పాపులారిటీ, ప్రేక్షకుల రెస్పాన్స్ చూసిన జెమినీ టీవీ వారు ఇదే అనసూయతో సరికొత్త ప్రోగ్రాం ప్లాన్ చేశారు.

తల్లా? పెళ్ళామా..?

తల్లా? పెళ్ళామా..?

ఇకపై అనసూయ జెమినీ టీవీ కోసం కూడా ఒక షో చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పైగా ఈ షోకి తల్లా? పెళ్ళామా?? అనే ఆసక్తికర టైటిల్ పెట్టి అనౌన్స్ చేశారు. ''జెమినీ టీవీ వారు అందిస్తున్న సరికొత్త గేమ్ షో, తల్లా? పెళ్ళామా? ఈ మార్చ్ 2 తారీకు నుండి ఆంకర్ అనసూయచే ప్రారంభమవుతుంది'' అని జెమినీ టీవీ అఫీషియల్ గా ప్రకటించింది.

హాట్ లుక్‌లో అనసూయ హంగామా.. ప్రోమో వైరల్

హాట్ లుక్‌లో అనసూయ హంగామా.. ప్రోమో వైరల్

ఈ మేరకు జెమినీ టీవీ విడుదల చేసిన తల్లా? పెళ్ళామా? వీడియో వైరల్ అయింది. ఈ ప్రోమోలో హాట్ డ్రెస్ వేసుకొని చదరంగం ఆడుతూ అనసూయ కనిపించింది. మామూలుగానే హాట్ హాట్ డ్రెస్సింగ్‌తో అదరగొట్టే ఈ బ్యూటీ.. ఈ షో కోసం ఆ డోస్ మరింత పెంచినట్టు తెలుస్తోంది.

వెరీ హాట్.. వేడెక్కుతున్న సోషల్ మీడియా

వెరీ హాట్.. వేడెక్కుతున్న సోషల్ మీడియా

ఓ వైపు బుల్లితెర హంగామా చేస్తూనే సోషల్ మీడియాను వేడెక్కించడం అనసూయ స్టైల్. ఎప్పటికప్పుడు తన హాట్ అండ్ గ్లామర్ లుక్స్ షేర్ చేస్తూ ఆన్‌లైన్ వేదికపై కూడా మాంచి ఫాలోయింగ్ సంపాదించింది ఈ జబర్దస్త్ బ్యూటీ. అనసూయ పోస్ట్ చేసిన హాట్ పిక్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

Recommended Video

Anchor Anasuya Vs Anchor Manjusha In Jabardasth Comedy Show | Filmibeat Telugu

జబర్దస్త్ సిల్వర్ స్క్రీన్ జర్నీ

ఇకపోతే అనసూయ సిల్వర్ స్క్రీన్ జర్నీ కూడా జబర్దస్త్‌గా సాగిపోతోంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు పెట్టేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. వెండితెర రంగమ్మత్తగా పాపులర్ అయిన ఈమె నితిన్ హీరోగా రూపొందనున్న అందాదున్ రీమేక్ లో నటించనున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X