అనసూయ నూతన గృహ ప్రవేశం.. రంగమ్మత్త ఆస్తులు ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్‌లో ఉన్న స్టార్ యాంకర్‌లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. యాంకరింగ్‌కు గ్లామర్ జోడించిన వ్యక్తి అనసూయే అంటారు. యాంకర్ అంటే మంచి వాక్చాతుర్యం, సమయస్పూర్తి ఉండాలనే రూల్స్‌ను బ్రేక్ చేశారు అనసూయ. ఈమె ఎంట్రీతో యాంకరింగ్‌లోకి అనేక మంది ముద్దుగుమ్మలు వచ్చారు. ప్రస్తుతం యాంకరింగ్‌కు దూరంగా సినిమాలపై ఫోకస్ పెట్టి దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుల్లో ఒకరిగా దూసుకెళ్తున్నారు అనసూయ భరద్వాజ్.

నాగ సినిమాలో మెరిసిన అనసూయ

15 మే 1985న జన్మించిన అనసూయ మరో రెండ్రోజుల్లో 40వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌లోని భద్రుక కాలేజీ నుంచి 2008లో ఎంబీఏ పట్టా పొందారు అనసూయ. చదువు తర్వాత కొన్నాళ్లు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగు పాపులర్ న్యూస్ ఛానెల్‌ సాక్షిలో న్యూస్ రీడర్‌గా పనిచేశారు. అలాగే మా మ్యూజిక్‌లోనూ యాంకర్‌గా చేశారు. ఈ క్రమంలో వేదమ్, పైసా సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. కాలేజ్ రోజుల్లో ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో తళుక్కున మెరిశారు అనసూయ భరద్వాజ్.

Anasuya Bharadwaj House Warming Ceremony Photos goes viral

జబర్దస్త్‌తో బ్రేక్

ఈ దశలో ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ అనసూయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ షోకు హోస్ట్‌గా రావడంతో ఆమె తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. రోజా, నాగబాబు వంటి స్టార్స్ ఉన్నప్పటికీ అనసూయ తన అందం, లుక్స్‌తో జబర్దస్త్‌కు అట్రాక్షన్‌గా మారారు. ఉత్తరాదికి చెందిన సుశాంక్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లాడారు ఈ స్టార్ యాంకర్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

కాలేజీ రోజుల్లోనే సుశాంక్‌తో ప్రేమ

కాలేజ్ రోజుల్లోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అనసూయను సుశాంక్ చదివించి, ఆమెకు అన్ని విషయాల్లో అండగా నిలిచారు. అనసూయ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక సుశాంక్ ప్రోత్సాహం ఎంతో ఉంది. 2016లో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనలో నాగ్‌కు మరదలిగా ఆయనతో ఆడిపాడారు. ఈ దశలో రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

పుష్పతో నేషనల్ వైడ్ పాపులారిటీ

సుకుమార్ - అల్లు అర్జున్‌ల బ్లాక్ బస్టర్ సిరీస్ పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాల్లో ద్రాక్షాయణిగా క్రూరత్వం చూపించారు. యాంకరింగ్‌కు పూర్తిగా దూరమైన అనసూయ ఇప్పుడు తన ఫోకస్ సినిమాలపైనే పెట్టింది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లులో స్పెషల్ సాంగ్‌తోపాటు తమిళ్‌లో ఫ్లాష్‌బ్యాక్, వోల్ఫ్ సినిమాలలో అనసూయ నటిస్తున్నారు.

కొత్తింట్లో అనసూయ గృహ ప్రవేశం

అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్తింటిలోకి అడుగుపెట్టారు. ఆ ఇంటికి శ్రీరామ సంజీవని అనే పేరు పెట్టుకున్నారు. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. పలువురు సెలబ్రెటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనసూయ రెమ్యునరేషన్, ఆస్తుల గురించి నెటిజన్లు ఆన్‌లైన్‌ను జల్లెడ పడుతున్నారు. ఈ వివరాలు చూస్తే.

భారీగా పెరిగిన అనసూయ ఆస్తులు

సినిమాలు, షోలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఓపెనింగ్స్‌తో అనసూయ నెలకు బాగానే సంపాదిస్తోందని ఇండస్ట్రీ టాక్. ఆమెకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఖరీదైన ఇల్లు, రెండు లగ్జరీ కార్లు, పొలాలు ఉన్నాయని చెబుతారు. తన సంపాదనను తెలివిగా పలు కంపెనీల్లో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడంతో ఈమె ఆస్తులు భారీగా పెరిగినట్లుగా బుల్లితెర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనసూయ ఆస్తుల విలువ రూ.40 కోట్ల వరకు ఉంటుందని ఫిలింనగర్ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X