రోజా పువ్విస్తూ అనసూయతో జబర్దస్తీ.. హైపర్ ఆదిని చితకబాదిన ఆడపడుచులు!! వీడియో వైరల్
జబర్డస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు యాంకర్ అనసూయ, కమెడియన్ హైపర్ ఆది. అయితే ఈ ఇద్దరూ ఒకేసారి వేదికపైకి వస్తే చాలు ఆ కెమిస్ట్రీ, ఆ రొమాంటింగ్ లుక్స్ ప్రేక్షకులకు ఓ రేంజ్ కిక్కిస్తాయి. బుల్లితెర జోడీల్లో అనసూయ- హైపర్ ఆది జోడీకి ఉన్న పాపులారీయే వేరు. అలాంటి ఈ ఇద్దరికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

అనసూయ- హైపర్ ఆది జోడీ.. ఊహాగానాలు
జబర్దస్త్ జోడీల్లో అనసూయ- హైపర్ ఆదిలకు ప్రత్యేక స్థానం ఉంది. యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు.. ఇక హైపర్ ఆది ఆమెపై పంచుల మీద పంచులేస్తుంటాడు. అలాగే అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు. అందుకే అనసూయ- హైపర్ ఆది జంటను కూడా మరోలా ఊహించుకుంటూ ఉంటారు ఆడియన్స్.

అనసూయ ప్రేమ కోసం హైపర్ ఆది ప్రయత్నం
ఇదిలా ఉంటే.. ప్రతి రోజు పండగే (బ్రాండ్ న్యూ లేడీస్) అనే లేటెస్ట్ టెలివిజన్ షో ఒకటి ప్రసారం అవుతోంది. దీనికి అనసూయ యాంకర్‌గా చేస్తోంది. ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసమే డిజైన్ చేసిన షో. తాజాగా ఈ షో ప్రోమో వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇందులో అనసూయ ప్రేమ కోసం హైపర్ ఆది ప్రయత్నాలు హైలైట్‌గా నిలిచాయి.

జబర్దస్తీ చేస్తూ అనసూయకు రోజా పువ్విచ్చిన హైపర్ ఆది
ఇన్నాళ్లు జబర్దస్త్ వేదికపై అనసూయతో రొమాంటిక్ వేషాలు వేస్తూ ఆమె కోసం పరితపించిన హైపర్ ఆది.. ఇప్పుడు ఆమె ప్రేమ కోసం ''ప్రతి రోజు పండగే'' వేదికపైకి కూడా వచ్చేశాడు. అంతేకాదు ఆమెకు రోజా పువ్వు కూడా ఇచ్చేసి సిగ్గుమొగ్గలేశాడు. 'నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా' అంటూ ఓ సాంగ్ వేసుకొని అనసూయపై ఉన్న లవ్ తెలిపాడు.

అనసూయ మనసు గొలుచుకోవడానికే వచ్చా..
హైపర్ ఆది వేషాలతో విసిగిపోయిన అనసూయ.. షోలో పాల్గొనడానికి వచ్చిన ఆడపడుచులను పిలిచి విషయం చెప్పింది. ఇది ఆడవాళ్ళ షో నువ్వెందుకు వచ్చావ్ అని హైపర్ ఆదిని ఆ ఆడపడుచులు ప్రశ్నించగా.. తాను ''అనసూయ మనసు గొలుచుకోవడానికి వచ్చా'' అంటూ జబర్దస్తీ చేశాడు హైపర్ ఆది.

అటాక్ అనేసిన బ్యూటీ.. చితకబాదిన ఆడపడుచులు
హైపర్ ఆది ఎంతకూ ఎవ్వరి మాటా వినకుండా పంచులు మీద పంచులేస్తుండటంతో.. అటాక్ అంటూ ఆర్డర్ ఇచ్చేసింది అనసూయ. దీంతో ఆడపడుచులంతా ఒక్కటై హైపర్ ఆదిని చితకబాదారు. దీంతో భయపడిపోయిన హైపర్ ఆది.. అమ్మో! ఇది ఆడవాళ్ళకు మాత్రమే అట.. కాస్త చూసుకోండి అంటూ వెళ్ళిపోయాడు.
Recommended Video
వీడియో వైరల్.. సూపర్ ప్రమోషన్
ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలతో కూడిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి రోజు పండగే షోకి మంచి ప్రమోషన్ ఇస్తోంది. ఏదేమైనా ఈ వీడియోలో అనసూయ- హైపర్ ఆది ప్రేమ ముచ్చట్లు మాత్రం బుల్లితెర ప్రేక్షకులకు మరో కిక్కిచ్చాయనే చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











