twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెరువు గట్టుపై చీరలో.. అదే మన బలమని అంటోన్న అనసూయ

    |

    యాంకర్, హోస్ట్, నటి, హీరోయిన్ ఇలా ఏ పేరుతో పిలిచిన వాటికి అందాన్ని తెచ్చింది మాత్రం అనసూయే. యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతి కొద్ది మందిలో అనసూయ కచ్చితంగా ఉంటుంది. జబర్దస్త్ షోకు మొదటగా క్రేజ్‌ తెచ్చింది అనసూయే. బుల్లితెరపై సందడి చేసిన అనసూయ.. వెండితెరపైనా తన ప్రతిభను చూపెట్టింది. అయితే బుల్లితెరపై గ్లామర్‌ను ఒలకబోస్తే వెండితెరపై నటనలోనే ప్రతిభను చూపెట్టింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో రంగమ్మత్తగానే నిలిచింది. తాజాగా తన సొంతూరు భూదాన్ పోచంపల్లిలో సందడి చేసింది.

    లాక్‌డౌన్‌లో సందడి..

    లాక్‌డౌన్‌లో సందడి..


    మూడు నెలల లాక్ డౌన్ కాలంలో అనసూయ ఎన్నో సార్లు వార్తల్లో నిలిచింది. లైవ్ అందాల కనువిందు చేసి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. కాంట్రవర్సీ స్టేట్మెంట్లు చేసి అందరికీ టార్గెట్ అయింది. లైవ్‌లో నెటిజన్లు తిట్టి మళ్లీ వైరల్ అయింది. తన డ్రెస్సింగ్ మీద కామెంట్స్ చేసిన వారిని దులిపేసింది.

    మళ్లీ పనుల్లో బిజీగా..

    మళ్లీ పనుల్లో బిజీగా..


    దాదాపు వంద రోజుల తరువాత మళ్లీ కెమెరాముందుకు వెళ్లింది అనసూయ. రీసెంట్‌గా జబర్దస్త్‌కు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. అందులో అనసూయ మరింత గ్లామర్‌గా కనిపించింది. చాలా రోజుల తరువాత సెట్‌లోకి వచ్చామని, అక్కడి కబుర్లను చెప్పుకొచ్చింది.

     వెరైటీ లుక్..

    వెరైటీ లుక్..


    అనసూయ తన లుక్‌ను మార్చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ‘నేను ఏది చేస్తానో దాన్ని ప్రేమిస్తాను.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను.. నా వేషధారణ, నా మనసు, నా అంతరాత్మ.. మళ్లీ నా పని ప్రపంచంలోకి వచ్చాను.. నన్ను ఇంత కొత్తగా మార్చేందుకు వచ్చిన సచిన్‌కు థ్యాంక్స్'అని చెప్పుకొస్తూ ఇంగ్లీష్ పాపలా మారిపోయింది.

    చెరువుగట్టుపై చీరలో..

    చెరువుగట్టుపై చీరలో..

    తాజాగా అనసూయ తన సొంతూరు భూదాన్ పోచంపల్లిలో ప్రత్యక్షమైంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తబ్బిబ్బైపోయింది. నేత కార్మికులు తయారు చేసిన చీరను కట్టుకుని అలా చెరువుగట్టు వద్ద పోజులు ఇచ్చింది. ఇక చీరలో అనసూయ అందాలు రెట్టింపు కావడంతో అంతా ఫిదా అవుతున్నారు.

    Recommended Video

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
    అదే మన బలం..

    అదే మన బలం..


    తన సొంతూరిలో అందరికీ నిత్యావసర సరుకులను పంచినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. నా సొంతూరికి వెళ్లాను, నా ప్రజలు, మేమంతా కలిసి ఉంటాము.. ఒకరినొకరు రక్షిస్తూ ఉండాలి.. చేనేత వస్త్రాలను ధరించాను.. చేనేత వస్త్రాలంటేనే ఇష్టం.. చేనేత కార్మికులకు అండగా ఉంటాను.. చేనేత కార్మికులే మన ఆస్తి, మన బలమని అని అనసూయ పేర్కొంది.

    English summary
    Anasuya Bharadwaj In Her Native Place Bhoodan Pochampally. Anasuya Wears Weaver Saree ANd Hair Style And Look Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X