కోడి మెదడ్లు ఉన్నవాళ్లకు రిప్లై ఇవ్వలేను.. నెటిజన్ల ట్రోలింగ్‌పై అనసూయ అదిరిపోయే సెటైర్
అనసూయ, సోషల్ మీడియా, నెటిజన్లు, ట్రోలింగ్ అనే వాటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అనసూయ సోషల్ మీడియాను వదలదు. నెటిజన్లు ఆమెను ఫాలో అవ్వడం, ట్రోల్ చేయడం ఆపరు. అనసూయ తిరిగి వారికి కౌంటర్లు ఇవ్వడంలోనూ వెనక్కి తగ్గదు. ఇలా ఎన్నో సందర్భాల్లో అనసూయకు, నెటిజన్లకు మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంటుంది. తాజాగా అనసూయ తన భర్త సుశాంక్ బర్త్ డేను గోవాలో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే.

బర్త్ డే సెలెబ్రేషన్స్..
సుశాంక్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకునేందుకు అనసూయ ఫ్యామిలీ అంతా గోవా వెకేషన్‌కు వెళ్లింది. మొత్తానికి భర్త బర్త్ డేకు మంచి ప్లాన్ వేసి అనసూయ బాగానే సెలెబ్రేట్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ హలో.. మై గ్రావిటీ.. మై నట్ బట్టర్ టు మై జెల్లీ.. అంటూ భర్తపై ప్రేమను చాటింది అనసూయ. దాంతో పాటు భర్తతో దిగిన సెల్ఫీని షేర్ చేయగా అది వైరల్ అయింది.

బుల్లి నిక్కర్‌లో..
గోవా అందాలు ఓ వైపు ఆకర్షిస్తుంటే.. అనసూయ అందాల ఆరబోత మరో రేంజ్‌లో హల్చల్ చేసింది. వయ్యారాలను ఒలకబోస్తూ ఉన్న అనసూయ బ్యాక్ పిక్ ఒకటి షేర్ చేసింది. ఫోటో ఎంతగా వైరల్ అయిందో.. ఆమె పెట్టిన కామెంట్ అందకు పదింతలు వైరల్ అయింది.

అలా చేయడంతో ట్రోలింగ్..
గోవాలోని హిందూ సముద్రం వద్ద తాను ఉన్నట్లు ఓ ఫొటోను షేర్ చేసింది అనసూయ. ఆ ఫోటోలో వెనకనుంచి నిల్చున్న అనసూయ అందాల చూసి సంబరపడకుండా.. ఆమె పెట్టిన కామెంట్‌లోని తప్పును వెతికారు. అది హిందూ మహాసముద్రం కాదు అది కూడా తెలీదా? అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడం మొదలెట్టారు.
Recommended Video

సగం మెదడు..
ఇక అనసూయ ఈ ట్రోలింగ్‌ను గమనించడంతో అందరికీ కలిపి ఒకే ఒక్క పోస్ట్‌తో కౌంటర్ ఇచ్చింది. మీ లాంటి సగం మెదడు ఉన్న వాళ్లకు అందరికీ రిప్లై ఇవ్వలేను.. అందుకే వికీపీడియా స్క్రీన్ షాట్‌ను పెడుతున్నాను అరేబియా సముద్రం ఉత్తర హిందూ సముద్రంలోని ఒక ప్రాంతమంటూ.. చూసుకోండి.. కొంచెం తెలివి పెంచుకోండి అంటూ సెటైర్ వేసింది.


Click it and Unblock the Notifications











