అసూయ, ద్వేషం చూపించినా ఓకే.. రేట్ కూడా ఫిక్స్ చేసుకోండి.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్
జబర్దస్త్ యాంకర్‌గా, వెండితెరపై రంగమ్మత్తగా చెరిగిపోని ముద్ర వేసింది అనసూయ. అందం, ప్రతిభ, అదృష్ణం అన్నీ ఉన్న అందాల భామ అనసూయ. వివాహామై ఇద్దరు పిల్లలున్నా.. వన్నె తరగని అందంతో బుల్లితెరపై గ్లామర్‌ను ఒలకబోస్తోంది. అనసూయ డ్యాన్సులు, గ్లామర్‌తోనే షోకు వన్నె తెచ్చిందనడంలోనూ అతిశయోక్తి ఏమాత్రం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

ఇటు బుల్లితెర, అటు వెండితెర..
బుల్లితెర, వెండితెరపై ఒకేసారి వెలిగినవారు చాలా అరుదు. బుల్లితెర ఆర్టిస్ట్‌లకు వెండితెర అంతగా కలిసి రాదని, వెండితెర నటీమణులకు బుల్లితెర అంతగా అచ్చిరాదని అంటుంటారు. అయితే అనసూయ మాత్రం రెండు చోట్లా చక్రం తిప్పుతోంది.

సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్..
స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్‌ను రెండింటిని బ్యాలన్స్ చేయడంలోనే సమయం అంతా గడిచిపోతూ ఉంటుంది. అయినా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం నిత్యం టచ్‌లో నే ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కనువిందు చేస్తూ ఉంటుంది.

సామాజిక సమస్యలపైనా..
కేవలం ఫోటోలు షేర్ చేయడం, అప్‌డేట్స్ ఇవ్వడమే కాకుండా సామాజిక సమస్యలపైనా స్పందిస్తుంది. దిశ హత్య ఘటన, నిర్భయ ఘటన వంటివాటిపైనా తన గొంతును వినిపిస్తుంది. అయితే అనసూయకు సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆమె షేర్ చేసే ఫోటోలే ఆమెకు తలవంపులు తీసుకొస్తున్నాయి.
Recommended Video
నాకు రేట్ ఇవ్వండి..
ఆమెను ఎంత మంది టార్గెట్ చేసినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అందర్నీ సరైన సమాధానం చెబుతూ ముందుకుసాగుతూనే ఉంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. మీరు నాపై అసూయను చూపించినా, నన్ను ద్వేషించినా, నన్ను రేట్ చేసినా పర్లేదు.. ఎందుకంటే.. మీరు నేను కాదు.. అంటూ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











