Anasuya: నా రాష్ట్రంలో అది అవమానం.. అనసూయ పోస్ట్.. ఆంటీ అన్నందుకు అంటూ!
యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ యాంకర్లలో బ్యూటిఫుల్ అనూసయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేస్తోంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే అనసూయ అనేకసార్లు ట్రోలింగ్ బారిన పడింది. ఏదో ఒక విషయంపై రెగ్యులర్ గా పోస్టులు పెట్టే అనసూయ తాజాగా మరో పోస్ట్ పెట్టింది.

ఒక్కసారిగా ఫేమస్..
బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రారంభంలో న్యూస్ యాంకర్ గా చేసిన ఆమె తర్వాతి కాలంలో మంచి నటిగా గుర్తింపు పొందింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సదా నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రను చేసిన అనసూయ ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాతి కాలంలో జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతంగా యాంకరింగ్ చేసి అందరి దృష్టిలో పడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

వరుసగా నటనతో..
జబర్దస్త్ షో తర్వాత నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ అనసూయ. అలా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకువెళ్లిన అనసూయ మరోవైపు సినిమాల్లోనూ సత్తా చాటింది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున డ్యుయల్ రోల్ లో నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది.

భారీ చిత్రాలు..
ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని అనసూయ సినిమాల్లో హవా చాటుతోంది. ఇటీవల డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కినన రంగమార్తాండ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కు కోడలుగా మరోసారి తన నటనలో మార్క్ చూపించింది. అనసూయ నటనకు ప్రశంసలు సైతం వస్తున్నాయి. ఇదే కాకుండా వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్, అరి సినిమాల్లో నటిస్తోంది అనసూయ.

ఆకట్టుకుంటున్న పోస్ట్..
ఇక సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు, హాట్ ఫొటోలతో పిచ్చెక్కించే అనసూయ అప్పుడప్పుడు ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. సామాజిక మాధ్యమంలో తనదైన శైలీలో పలు అంశాలపై రియాక్ట్ అయ్యే అనసూయకు నెటిజన్లు వింత కామెంట్స్ పెడుతుంటారు. ఇక ఇటీవల ఆమెను ఆంటీ అంటూ సంబోధించడం వివాదం అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

వీడియో వైరల్..
ముద్దుగుమ్మ యాంకర్ అనసూయ తాజాగా ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో 100 ఏళ్లు వయసున్న వృద్ధులకు రన్నింగ్ పోటీ నిర్వహిస్తారు. 102 సంవత్సరాలు ఉన్న పండు ముసలి వ్యక్తి ఈ ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ "నా దేశంలో, నా రాష్ట్రంలో వయస్సు పెరగడం అనేది ప్రతీ ఒక్కరికి అవమానం" అని రాసుకొచ్చింది ఈ యాంకరమ్మ.
అసూయ పడే యువతిగా..
అయితే అనసూ షేర్ చేసిన లేటెస్ట్ వీడియోపై అందరూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆంటీ అన్నందుకు ఫీల్ అయినట్లుంది అని మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యాంకర్ అనసూయ అరి అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అసూయ పడే యువతిగా అనసూయ కనిపించనున్నట్లు ఇటీవల విడుదలై టీజర్ ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











