Jabardasth గోడవపై అసలు క్లారిటీ ఇచ్చిన అనసూయ.. అందుకే వదిలేశా అంటూ..

జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు అందుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు. షో స్టార్ట్ అయినప్పుడు నుంచి కూడా చాలా కాలం పాటు కొనసాగిన అనసూయ ఇటీవల హఠాత్తుగా తప్పుకోవడంతో అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. కొన్ని గొడవల కారణంగానే అసంతృప్తితో అనసూయ కామెడీ షో నుంచి తప్పకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక మొత్తానికి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ ఆ కన్ఫ్యూజన్ పై ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది.. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో అలా..

మొదట్లో అలా..

మొదట కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి కథానాయక కొనసాగాలని అనుకుంది. కానీ కొన్ని కారణాల వలన ఇండస్ట్రీకి కొంతకాలం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని ప్రైవేటు కంపెనీలలో జాబ్ కూడా చేసింది. అప్పట్లో ఆర్య 2 సినిమాలో సుకుమార్ ఆమెను శ్రద్ధాదాస్ చేసిన పాత్రలో చూపించాలని అనుకున్నాడు. కానీ అనసూయ ఆ సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు.

కొన్ని రోజులకే నెంబర్ వన్

కొన్ని రోజులకే నెంబర్ వన్

ఇక యాంకర్ గా మొదట టెలివిజన్లో ఆమె గుర్తింపును తెచ్చుకోవాలని అనుకుంది. పలు న్యూస్ ఛానల్స్ లో కూడా ఆమె న్యూస్ రీడర్ గా వర్క్ చేసింది. ఇక జబర్దస్త్ షో కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న అనసూయ ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయింది. 2012 నుంచి జబర్దస్త్ షోలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ షో స్టార్ట్ అయిన కొన్ని రోజులకే నెంబర్ వన్ రేటింగ్స్ అందుకోవడంతో ఒక్కసారిగా అనసూయ రేంజ్ కూడా పెరిగిపోయింది.

అన్ని భాషల్లో అవకాశాలు

అన్ని భాషల్లో అవకాశాలు

కేవలం యాంకర్ గానే కాకుండా అనసూయ మంచి నటిగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఆమెకు తమిళంలో అలాగే మలయాళం లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా నెగిటివ్ పాత్రలో ఆమె కనిపించిన విధానం కూడా కట్టుకుంది. అప్పట్లో క్షణం సినిమాలో నెగిటివ్ పాత్రలో ఊహించని విధంగా దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.

 పలు విభేదాలు రావడం వలన

పలు విభేదాలు రావడం వలన

ఇక రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలలో ఆమె చేసిన పాత్రలకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరొకవైపు జబర్దస్త్ యాంకర్ గా కొనసాగిన అనసూయ హఠాత్తుగా ఆ షో నుంచి తప్పుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదట్లో అయితే జబర్దస్త్ యాజమాన్యంతో పలు విభేదాలు రావడం వలన ఆమె వెళ్లిపోయినట్లుగా కూడా టాక్ వచ్చింది.

 అందుకే షో నుంచి బయటకు

అందుకే షో నుంచి బయటకు

అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ జబర్దస్త్ గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడం ఒక కారణం అయితే రియాల్టీ షోలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని అనుకున్నాను. అందుకే జబర్దస్త్ కు కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. నా హృదయంలో మాత్రం జబర్దస్త్ కు ఇప్పటికీ ఒక స్థానం అయితే ఉంటుంది. కొన్నిసార్లు లైఫ్లో మార్పులు జరుగుతాయి. రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాను అని అనసూయ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది. దీన్ని బట్టి జబర్దస్ షో యాజమాన్యంతో ఆమెకు పెద్దగా విభేదాలు రాలేవని అర్థమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X