పవన్ కల్యాణ్‌తో అనసూయ ఐటెం సాంగ్‌.. మోత మోగిపోతుంది అంటూ రంగమ్మత్త లీక్!

యాంకర్ నుంచి యాక్టర్‌గా మారిన అనసూయ భరద్వాజ్ తెలుగు తెర మీద భావోద్వేగమైన, భారమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఆరంభంలో గ్లామర్ పాత్రలతో ఉర్రూతలూగించిన ఆమె రంగస్థలం సినిమా తర్వాత ఎమోషనల్, విలనిజం కార్యెక్టర్లతో మోత మోగిస్తున్నారు. అయితే ఇటివల ఓ టెలివిజన్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యే విషయాన్ని లీక్ చేశారు. అయితే ఆమె చెప్పిన సీక్రెట్ ఏమిటంటే?

అనసూయ ఆరంభంలో కొంత గ్లామర్, హై రేంజ్‌లో స్కీన్ షో పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేశారు. అయితే రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తర్వాత పుష్ప, విమానం లాంటి సినిమాల్లో ప్రేక్షకులను ఉద్వేగాలకు గురిచేసే పాత్రలో కనిపించి తనలోనే యాక్టర్‌ను పరిచయం చేశారు.

Anasuya Bharadwaj Leaks Dance Number with Pawan Kalyan in Hari Hara Veera Mallu

గతంలో ఆమె పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అదే.. స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు. అత్తారింటికి దారేది సినిమాలో వాస్తవానికి ఆమె పవన్ కల్యాణ్‌తో ఓ పాటలో స్టెప్పులు వేయాల్సి ఉండేది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా చేయలేకపోయారనే విషయం అప్పట్లో బయటకు వచ్చింది.

Anasuya Bharadwaj Leaks Dance Number with Pawan Kalyan in Hari Hara Veera Mallu

అయితే పవన్ కల్యాణ్ పక్కన డ్యాన్స్ చేసే ఆఫర్‌ను రిజెక్ట్ చేశారనే కారణంతో పవర్ స్టార్ అభిమానులు ఆమెను ట్రోల్ కూడా చేశారు. అయితే అసలు విషయం తెలిసిన తర్వాత ఒకే.. అంటూ ఆమెపై కొంత శాంతించారు. అయితే అప్పుడు మిస్ అయిన ఛాన్స్‌ను మరోసారి ఆమె తాజాగా పట్టేసుకొన్నది.

Anasuya Bharadwaj Leaks Dance Number with Pawan Kalyan in Hari Hara Veera Mallu

అయితే తాజాగా శ్రీముఖి హెస్ట్‌గా వ్యవహరించే ఓ రియాలిటీ షోలో అనసూయ జడ్జీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెలివిజన్ స్క్రీన్‌పై ఎవరికి తెలియని విషయాన్ని చెప్పాలని ఫిక్స్ అయ్యాను. పవన్ కల్యాణ్‌ సార్‌తో నేను ఒక బ్యూటీఫుల్ సాంగ్‌పై స్టెప్పులు వేశాను.ఆ డ్యాన్స్ నంబర్ మాత్రం టెలివిజన్‌ రియాలిటీ షోలో మోత మోగిపోతుంది అని అనసూయ భుజాలు ఎగెరేసుకొంటూ చెప్పారు.

Anasuya Bharadwaj Leaks Dance Number with Pawan Kalyan in Hari Hara Veera Mallu

దాంతో అనసూయ మాటల వినగానే పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్, హోస్ట్ శ్రీముఖి అవునా? నిజామా? అంటూ ఓ గమ్మత్తైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఈ చెప్పిన మాటలు వీడియో రూపంలో వైరల్ అవుతున్నది. అయితే ఆమె హరిహర వీరమల్లు సినిమాలో ఓ డ్యాన్స్ నంబర్‌పై పవన్‌తో స్టెప్పులు వేశారనే విషయం ఆమె చెప్పకపోయినా.. బయట ట్రెండింగ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X