పొట్టి బట్టల్లో యమ హాట్‌గా అనసూయ: పబ్లిక్ ప్లేస్‌లోనే భర్తతో క్రేజీగా లిప్‌లాక్
ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా హడావిడి చేస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే భారీ స్థాయిలో గుర్తింపును, ఫాలోయింగ్‌ను సంపాదించుకుని దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఆకట్టుకునే రూపం.. అద్భుతమైన హోస్టింగ్.. ఆహా అనిపించే హావభావాలతో మైమరపిస్తోన్న ఈ బ్యూటీ.. సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది.
కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా అనసూయ ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

జబర్ధస్త్‌గా అనసూయ కెరియర్
అనసూయ చాలా కాలం క్రితమే యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. జబర్ధస్త్ షో ద్వారా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు నడుపుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది.

సినిమాల్లో సత్తా... వరుస హిట్లు
యాంకర్‌గా చాలా ఏళ్లుగా సత్తా చాటుతోన్న అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి నటనతో మాయ చేస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసింది.

భారీ చిత్రాల్లో భాగమైన బ్యూటీ
గతంలో మాదిరిగా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా సందడి చేయట్లేదు. అయితే, ఆమె ఇప్పుడు ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే
ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ సందడి చేస్తోంది.

భర్తతో హాలీడే ట్రిప్‌లో సందడి
కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ భరద్వాజ్.. తన ఫ్యామిలీతో కూడా ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే తన భర్త, ఇద్దరు పిల్లలతో వీలు చిక్కినప్పుడల్లా ట్రిప్పులు ప్లాన్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

పొట్టి బట్టల్లో అందాల విందు
భర్తతో కలిసి సముద్ర తీరంలో ఎంతగానో ఎంజాయ్ చేస్తోన్న అనసూయ భరద్వాజ్.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఆమె ఓ రొమాంటిక్ వీడియోను వదిలింది. ఇందులో అనసూయ పొట్టి బట్టల్లో కనిపించింది. ఫలితంగా ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.

పబ్లిక్ ప్లేస్‌లోనే లిప్ కిస్‌లతో
ఇదే వీడియోలో అనసూయ భరద్వాజ్ రెచ్చిపోయింది. బీచ్‌లో ఆమె తన భర్తతో పెదాలు ముడివేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా సార్లు అతడితో ఘాడ చుంబనాలు చేసింది. ఇవి అనసూయ షేర్ చేసిన వీడియోలో కనిపించాయి. ఫలితంగా ఇందులో ఇది మాత్రమే తెగ హైలైట్ అవుతోంది. దీంతో ఈ అమ్మడిపై కొందరు విమర్శలు చేస్తూ కామెంట్లను కూడా పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











