HBD Anasuya Bharadwaj: న్యూస్ రీడర్ నుంచి స్టార్ సెలబ్రిటీగా.. అనసూయ ఆస్తులు ఎన్ని కోట్లంటే?

సాధారణ న్యూస్ రీడర్ స్థాయి నుంచి సినీరంగంలో స్టార్ సెలబ్రిటీగా ఎదిగారు అనసూయ భరద్వాజ్. మీడియా, సినీరంగంలో ఉండే పోటీని తట్టుకుని, ఎత్తుపల్లాలను ఎదుర్కొని ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. సినిమాలు, టెలివిజన్ షోల కంటే వివాదాలతోనే అనసూయ భరద్వాజ్ వార్తల్లో నిలుస్తుంటారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ధైర్యంగా పోరాడుతుంటారు. మే 15న అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ స్టార్ యాంకర్ కెరీర్, వ్యక్తిగత జీవితం, ఆమె ఆస్తుల తదితర ఆసక్తికర వివరాలు పరిశీలిస్తే..

Also Read
'రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావుగా... మా ఇంట్లోనూ అద్దం ఉంది’
'రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావుగా... మా ఇంట్లోనూ అద్దం ఉంది’

15 మే 1985న హైదరాబాద్‌లో జన్మించారు అనసూయ భరద్వాజ్. నగరంలోని భద్రుక కాలేజీ నుంచి 2008లో ఎంబీఏ పట్టా పొందారు అనసూయ. చదువు తర్వాత కొన్నాళ్లు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా మీడియా రంగంలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత మా మ్యూజిక్‌లోనూ యాంకర్‌గా చేశారు. ఈ క్రమంలో వేదమ్, పైసా సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. కాలేజ్‌లో చదువుకుంటున్న రోజుల్లో ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు అనసూయ భరద్వాజ్.

Anasuya Bharadwaj Net Worth Here is Jabardasth Anchor Remuneration and Assets Details

ఈ దశలో ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ అనసూయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ షోకు హోస్ట్‌గా ఛాన్స్ రావడంతో ఆమె తెలుగు లోగిళ్లకు బాగా దగ్గరయ్యారు. రోజా, నాగబాబు వంటి స్టార్స్ ఉన్నప్పటికీ అనసూయ తన అందం, లుక్స్‌తో జబర్దస్త్‌కు అట్రాక్షన్‌గా మారారు. తన హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లలో సెగలు రేపారు అనసూయ. అయితే తనకు జీవితాన్ని, ఫేమ్‌ను ఇచ్చిన జబర్దస్త్‌ షోకి అనసూయ గుడ్ బై చెప్పడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సినీరంగంలో బిజీ కావడం వల్లే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. క్షణం, సోగ్గాడే చిన్నినాయన, రంగస్థలం, పుష్ప సినిమాలు నటిగా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు సినీరంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేశాయి.

Recommended For You
Kara Closing Collections: కర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
Kara Closing Collections: కర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

ఉత్తరాదికి చెందిన సుశాంక్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లాడారు ఈ స్టార్ యాంకర్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కాలేజ్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అనసూయను చదివించడంతో పాటు కెరీర్‌పరంగానూ ఆమెకు అన్ని విషయాల్లో అండగా నిలిచారు సుశాంక్. తన భర్త గురించి ప్రతి ఇంటర్వ్యూలోనూ చెబుతూ ఎమోషనల్ అవుతారు అనసూయ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రంగమ్మత్త.. తన సినిమాలు, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఎవరైనా తన గురించి నోరుజారితే అస్సలు క్షమించే ప్రసక్తే లేదు. తనను వేధిస్తున్న వారిపై పలుమార్లు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా అనసూయ ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో హీరో శివాజీ- అనసూయల వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో ఫ్లాష్‌బ్యాక్, వోల్ఫ్ సినిమాలలో అనసూయ నటిస్తున్నారు.

You May Also Like
ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పిన శోభా శెట్టి... నిరీక్షణకు తెర అంటూ ఎమోషనల్
ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పిన శోభా శెట్టి... నిరీక్షణకు తెర అంటూ ఎమోషనల్

సాధారణ స్థాయి నుంచి ఈ రేంజ్‌కు చేరుకున్న అనసూయ బాగానే ఆస్తుల్ని కూడబెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. సినిమాలు, టీవీ కార్యక్రమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఓపెనింగ్స్‌తో అనసూయ భరద్వాజ్ ప్రతినెలా బాగానే సంపాదిస్తున్నారట. అలాగే తన సంపాదనను రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడి మార్గాల్లోకి మళ్లిస్తున్నారట రంగమ్మత్త. సోషల్ మీడియాలో ఉన్న సమాచారాన్ని బట్టి అనసూయకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దాదాపు 8 కోట్ల విలువైన ఓ ఇల్లు ఉందట. అలాగే ఇటీవల తను ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న కొత్తింటిలోకి అడుగుపెట్టారు అనసూయ. ఇవి కాకుండా మరిన్ని ప్రాపర్టీలు అనసూయ పేరిట ఉన్నాయని అంచనా. అలాగే అనసూయ గ్యారేజ్‌లో రెండు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట. మొత్తంగా అనసూయ ఆస్తుల విలువ 40 నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్‌లో ఉంటుందని ఫిలింనగర్ టాక్. ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెడుతున్న అనసూయ భరద్వాజ్ జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.

Read more about: anasuya bharadwaj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X