Anasuya Bharadwaj: ట్రెడిషనల్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్.. ఇలాంటి స్టిల్స్ నెవ్వర్ బిఫోర్!
టెలివిజన్ రంగంలో చాలామంది బ్యూటిఫుల్ యాంకర్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా ఆకట్టుకునే వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ టాప్ లిస్టు లో ఉంటారు అనే చెప్పాలి. ఎలాంటి షో చేసినా కూడా టెలివిజన్ లో టాప్ రేటింగ్స్ అందుకుంటూ వుంటాయి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా కూడా వెండితెరపై మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిత్యం సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ గ్లామర్ తో తన ఫాలోవర్స్ ను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆమె ట్రెడిషనల్ లుక్ లోనే తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది. ఆ ఫోటోలో పై ఒక లుక్కేస్తే..

నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసి..
అనసూయ భరద్వాజ్ మొదట యాంకర్ గా కాకుండా నటిగానే తన కెరీర్ ను కొనసాగించింది. అప్పుడెప్పుడో వచ్చిన నాగా సినిమాలో ఆమె ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కోసం వేరే జాబ్ చేసిన అనసూయ మరికొన్నాళ్లకు యాంకర్ గా మళ్ళీ తన కెరీర్ ను సరికొత్తగా స్టార్ట్ చేసి మంచి క్రేజ్ అందుకుంది.

గ్లామర్ తో..
ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యాంకర్ అనసూయ ఆ తర్వాత మరి కొన్ని రియాలిటీ షోలతో కూడా సందడి చేసింది యాంకర్ అనసూయ ఎలాంటి షో చేసిన కూడా ఇందులో సరికొత్త గ్లామర్ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా నిత్యం ఆమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

సోషల్ మీడియాలో..
అప్పుడప్పుడు కొన్ని సామాజిక అంశాలపై కూడా సోషల్ మీడియా ద్వారా అనసూయ స్పందిస్తూ ఉంటారు. నెగిటివ్ కామెంట్ చేసే వారికి కూడా ఆమె తనదైన శైలిలో గట్టిగా కౌంటర్ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరొకవైపు బుల్లితెర రియాలిటీ షోలలో యాంకర్ కొనసాగుతున్న అనసూయ రోజు రోజుకు తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంటోంది.

ట్రెడిషనల్ లుక్ లో గ్లామర్
ఇక నేడు ఉగాది పండుగ సందర్భంగా ఒకవైపు ట్రెడిషనల్ యాంగిల్ లో కనిపిస్తూనే మరొకవైపు తనదైన శైలిలో గ్లామర్ తో కూడా అనసూయ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ఉండే అనసూయ భారీస్థాయిలో లైక్స్ కూడా అందుకుంటూ వుంటుంది. ఉగాది పండుగ రోజు కూడా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

సినిమాలతో బిజీగా..
ఇక సినిమాల విషయానికొస్తే పుష్ప సినిమాలో ఆమె చేసిన దాక్షాయని పాత్రకు మంచి గుర్తింపు లభించడంతో మరికొన్ని మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా లో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు లభించడంతో ఆ తర్వాత ఆమె నటిగా మంచి డిమాండ్ ఏర్పడింది.. పుష్ప 2లో ఆమె పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందట. ఇక తెలుగులోనే కాకుండా మలయాళం తమిళం భాషల్లో కూడా అనసూయ మంచి అవకాశాలను అందుకుంటోంది.


Click it and Unblock the Notifications











