షాకింగ్: జబర్ధస్త్ నుంచి అనసూయ ఔట్.. లాక్‌డౌన్ తర్వాత ఆమె కనిపించడం కష్టమే.!
తెలుగు బుల్లితెరపై వాక్చాతుర్యం ఉన్న యాంకర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ, కొందరు మాత్రం దానితో పాటు ఆకట్టుకునే అందం కూడా కలిగి ఉన్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఒకరు. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె... అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుస ఆఫర్లు సైతం దక్కించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు గుర్తింపును తెచ్చిన జబర్ధస్త్ షో నుంచి అనసూయ బయటకు వెళ్లిపోబోతుందట. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే....
Recommended Video

అనసూయ యాక్టింగ్ కెరీర్ సాగుతోందిలా
కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన అనసూయ. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. అప్పుడే మల్లెమాట ప్రొడక్షన్ దృష్టిలో పడింది. దీంతో వాళ్ల బ్యానర్‌లో వస్తోన్న ‘జబర్ధస్త్' అనే కామెడీ షోకు ఎంపిక అయింది. అప్పటి నుంచి ఆమెకు తిరుగులేకుండా పోయింది. దీని తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

జబర్ధస్త్‌తో గుర్తింపు.. తెలుగులోనే టాప్
అనసూయ కెరీర్‌లో జబర్ధస్త్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె... అందంతో పాటు వాక్చాతుర్యంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. కేవలం ఈ ఒక్క షో ద్వారానే టాప్ యాంకర్ అయిపోయింది. తద్వారా ఎన్నో షోలలో పని చేసే అవకాశాన్ని అందుకుని ముందుకు సాగుతోంది.

రెమ్యూనరేషన్‌లో అనసూయకే ఎక్కువ
జబర్ధస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్ధస్త్ అనేంతగా పాపులర్ అయింపోయిందీ అమ్మడు. అందుకే ఈమె డేట్స్ కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్ధస్త్ కామెడీ షో నిర్వహకులు ఆమెకు నెలకు రూ. 4 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బుల్లితెరపై ఎక్కువ ఛార్జ్ చేసే యాంకర్‌గా ఈమె రికార్డు క్రియేట్ చేసింది.

అప్పుడే అనసూయ వెళ్లుందనుకున్నారు
దాదాపు ఏడేళ్ల పాటు జబర్ధస్త్ జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు మెగా బ్రదర్ నాగబాబు. అలాంటి వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఆ షో నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆయన వెంటే కొందరు టీమ్ లీడర్లు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు వెళ్లిపోయారు. ఆ సమయంలో అనసూయ కూడా జబర్ధస్త్‌ను వీడి నాగబాబు వెంట వెళ్లిపోతుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

షాకింగ్: జబర్ధస్త్ నుంచి అనసూయ ఔట్
అనసూయ జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమన్న వార్తలు వెలువడిన సమయంలో.. ఆమె మాత్రం ఆ షోలోనే పని చేసింది. తద్వారా తాను ఎక్కడికీ వెళ్లడం లేదని పరోక్షంగా బదులిచ్చింది. కానీ, చాలా టీవీ షోలలో పాల్గొంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి అనసూయ జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పబోంతుందన్న వార్త బుల్లితెర సర్కిళ్లలో హల్‌చల్ చేస్తోంది.

లాక్‌డౌన్ తర్వాత ఆమె కనిపించదు.!
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం... అనసూయ లాక్‌డౌన్ తర్వాత జరిగే జబర్ధస్త్ షెడ్యూల్‌లో పాల్గొనడం లేదట. దీనికి కారణం ఆమె కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమాలేనని తెలుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలకు సంతకాలు చేసిన అనసూయ... ముందుగా వాటిని పూర్తి ఆ తర్వాత మిగిలిన షోలు చేసుకోవాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఆయనకు దాసిగా మారిపోయిన అను
ప్రస్తుతం అనసూయ... కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో ఆమె దేవదాసిగా కనిపింబోతుందని, అది చాలా స్పైసీగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య'తో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప'లో కీలక పాత్రలు చేస్తుందని అంటున్నారు. వీటికి తోడు మరిన్ని చిత్రాల్లో నటించబోతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











