ఆ ముగ్గురు నాకు మామయ్యలు.. రంగమ్మత్త ఛాన్స్ అలా దొరికింది.. అనసూయ

అనసూయ భరద్వాజ్.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. ఓ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన ప్రతిభతో స్టార్‌గా ఎదిగారు. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు అనసూయ.. మోస్ట్ వాంటెడ్ నటి. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉండేలా? సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నారు అనసూయ. గ్లామరస్‌గా కనిపించడమే కాదు.. నటిగానూ ఆమె సత్తా చాటారు.

రంగమ్మత్త రోల్‌తో బ్రేక్
అనసూయ కెరీర్‌లో రంగస్థలం సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో పలు సినిమాలు చేసినప్పటికీ ఈ చిత్రంలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. జబర్దస్త్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ.. అడపా దడపా సినిమాలలో నటించే అనసూయలో మంచి నటి ఉన్నారని ఈ సినిమా తర్వాత అందరూ గుర్తించడం మొదలు పెట్టారు. అసలు రంగమ్మత్త రోల్‌లో ఆమెను తప్పించి మరో నటిని కూడా ఊహించుకోలేమంటే అనసూయ ఎలాంటి ముద్ర వేశారో అర్ధం చేసుకోవచ్చు.

Anasuya Bharadwaj recalls how she get Rangammatta Role in Ram Charan s Rangasthalam

నో చెప్పిన రాశీ?
రంగమ్మత్త క్యారెక్టర్‌ను ఎవరైనా సీనియర్ నటితో వేయించాలని అనుకున్నారు దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా అలనాటి నటి రాశీని సుకుమార్ టీమ్ కలిసింది. గ్లామర్ రోల్స్‌తో పాటు హీరోయిన్‌గా 90వ దశకంలో దక్షిణాదిని ఒక ఊపిన రాశి అప్పటికే పెళ్లి చేసుకుని రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఓ మంచి పాత్ర దొరికితే చేద్దామని అనుకున్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ బృందం.. రాశీని సంప్రదించి రంగమ్మత్త క్యారెక్టర్ గురించి వివరించారట. అయితే రంగమ్మత్త క్యారెక్టర్ చేస్తే తనకు అవకాశాలు తగ్గిపోతాయని అనుకున్నారట. ఆ భయంతోనే రంగమ్మత్త ఆఫర్‌ను రాశీ వదులుకున్నారట. ఆ తర్వాత అనసూయను ఈ అదృష్టం వరించడం ఆమె ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే.

సుకుమార్ ఆఫర్ రిజెక్ట్ చేశా
ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్‌లో తన కెరీర్, ప్రేమ, పెళ్లి, కుటుంబంపై అనసూయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో జరిగిన మోసంతో నాన్నగారు కొత్తగా ఆయన ప్రయత్నాన్ని మొదలు పెట్టారని.. మేం ముగ్గురం కుమార్తెలమే కావడంతో అబ్బాయి పుట్టలేదన్న బాధ నాన్నలో ఉండేదని అనసూయ తెలిపారు. మా నాన్న చాలా అందంగా ఉండేవారని.. ఆయన అందమే నాకు వచ్చిందని చెప్పారు. ఓ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేస్తున్న సమయంలోనే సుకుమార్ గారు ఆర్య 2లో ఓ పాత్ర కోసం తనను సంప్రదించారని ఆమె గుర్తుచేసుకున్నారు. సినీ పరిశ్రమపై అప్పుడున్న కొన్ని అపోహలతో నటించేందుకు తాను అంగీకరించలేదని అనసూయ పేర్కొన్నారు.

ఆ ముగ్గురు నా మావయ్యలు
రంగస్థలం విషయానికి వస్తే.. నేను నటించిన క్షణం మూవీ కూడా సుక్కూ సార్ చూడలేదన్నారు. ఆయన టీమ్‌లో ముగ్గురు రైటర్స్ ఉండేవారని, వాళ్లంతా ఇప్పుడు సూపర్ డైరెక్టర్స్ అని చెప్పారు అనసూయ. బుచ్చిబాబు, కాశీ, శ్రీనివాస్ ముగ్గురూ రంగస్థలం మూవీకి రైటర్స్‌గా పనిచేసేవారని .. వీళ్లు నాతో మాయ్యా అనే పిలిపించుకుంటారని ఆమె తెలిపారు. రంగమ్మత్త క్యారెక్టర్ కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశారని.. కనీసం ఒక 20 మంది ఉంటారని, వారిలో సీనియర్స్, కొత్తవారు కూడా ఉన్నారని అనసూయ గుర్తుచేసుకున్నారు. నన్ను కూడా పిలిచి ఆడిషన్ తీసుకున్నారని.. 3 నెలల తర్వాత కాల్ వచ్చిందని, నేనైతే నాకు రాదని వదిలేసుకున్నానని కానీ షెడ్యూల్‌లో జాయిన్ అవ్వమని కాల్ వచ్చిందని అనసూయ చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X