‘450కే అది చేశాను.. ప్రతి రోజూ అంటే నావల్ల కాలేదు’
బుల్లితెర స్టార్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే. ఏకంగా దశాబ్దం పాటు 'జబర్దస్త్' కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు ఎంగానో దగ్గరైంది. తన యాంకరింగ్ స్కిల్స్ తో స్మాల్ స్క్రీన్ పై వెలుగొందింది. ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. టెలివిజన్ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ కూడా బుల్లితెర ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. ఇక కోవిడ్ తర్వాత ఈ స్టార్ యాంకర్ జబర్దస్త్ ను వీడిన సంగతి తెలిసిందే.
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దూరమైంది. దీంతో ఆమె అభిమానులు అనసూయను మిస్ అవుతున్నారు. మళ్లీ తనను బుల్లితెరపై చూసే అవకాశం ఎప్పుడు వస్తుందోనని ఆశపడుతున్నారు. ఇక అనసూయ భరద్వాజ్ యాంకర్ గా కెరీర్ ను వదిలి నటిగా సినిమా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అత్తగా 'రంగస్థలం'తో నటించి మెప్పించింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంటూ వస్తోంది.

ఇలా బుల్లితెరపై మెరవలేకపోయినా బిగ్ స్క్రీన్ పై కనిపిస్తూ సందడి చేస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఓవైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు తన అభిమానుల కోసం సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా తన మొదటి జాబ్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగులోని ప్రముఖ ఛానెల్ సాక్షిలో న్యూస్ రీడర్ గా చేశానని చెప్పారు. అంతకు ముందే సుకుమార్ సార్ తో పరిచయం ఏర్పడి అవకాశాలు ఇస్తానని చెప్పారు.
కానీ అప్పటికే నాకు ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అవ్వడంతో ఇంకా వెళ్ల లేకపోయాను. అయితే ఫస్ట్ రూ.450కే షూటింగ్ కు వెళ్లాను. నాగార్జున గారి సినిమ షూటింగ్ కు స్నేహితులతో కలిసి వెళ్లాం. ఆ తర్వాత సుగుణ, తదితర బ్రాండ్ ప్రమోషన్స్ ను కూడా చేశాను. కానీ సాక్షిలో న్యూస్ రీడర్ గా ప్రతిరోజూ చేయడం అంటే కష్టంగా అనిపించింది. దీంతో వెంటనే ఆ జాబ్ మానేశాను. కొంత కాలానికి జబర్దస్త్ షోకు యాంకర్ గా వచ్చాను. అని చెప్పింది. అయితే తనకు సుకుమార్ 'ఆర్య2' సమయంలోనే మంచి అవకాశాలు ఇస్తానని చెప్పారు. కానీ వెళ్లలేకపోయానని చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ ఎలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ తెలిసిందే. ఏకంగా ఇండియాను షేక్ చేసిన 'పుష్ప', 'పుష్ఫ2'లో దాక్షాయణి పాత్రలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి అనసూయ భరద్వాజ్ రేంజ్ మరింతగా పెరిగింది. సినిమా ఆఫర్లు దండిగా వస్తున్నాయి. విభిన్న పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు అనసూయ కూడా ప్రయత్నిస్తున్నారు. చివరిగా పుష్ప2తో పాటు రాజాకార్, ప్రేమ విమానం, పెద్ద కాపు 1తో అలరించింది. నెక్ట్స్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో మెరియనుంది. ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











