‘వెట్టి చాకిరి చేయించారు.. అదే సమయంలో ఆ ముగ్గురు డైరెక్టర్లతోనూ’
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా అనసూయ భరద్వాజ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. యాకంగ్ కెరీర్ ను ప్రారంభించిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మరోవైపు వెండితెరపైన కూడా గుర్తుండిపోయే పాత్రల్లో మెరుస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. అటు వెండితెర, ఇటు బుల్లితెపై మెరుస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇదెలా ఉంటే తన గురించి పలు సందర్బాల్లో ఇంటర్వ్యూల్లోనూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ వస్తోంది. ఇక ఫిల్మ్ కెరీర్ కాకుండా అనసూయ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
బుల్లితెర టు వెండితెర..
యాంకర్ గా అనసూయ భరద్వాజ్ 2013లో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. తన టాలెంట్, యాంకరింగ్, డ్యాన్స్ స్కిల్ తో అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది. 10 ఏళ్ల పాటు యాంకర్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ భరద్వాజ్ అటు పార్లర్ గా వెండితెరపైనా పలు చిత్రాలతో మెరుస్తూనే వస్తోంది. ప్రస్తుతం యాంకరింగ్ కెరీయర్ కు ఫుల్ స్టాప్ పెట్టి, పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు భారీ చిత్రాల్లో నటిస్తూ వెండితెరపై కూడా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర టు వెండితెరకు అనసూయ జర్నీ స్ఫూర్తిదాయకమని చెప్పాలి.

అనసూయ కెరీయర్ నిలబెట్టిన పాత్రలు..
బుల్లితెరపై యాంకర్ గా అలరించిన అనసూయ పార్లర్ గా సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా తన డ్యాన్స్ తో స్మాల్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసిన అనసూయకు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ల్లో నటించే అవకాశం దక్కింది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అలాగే క్షణం, రంగస్థలం, పుష్ప, ఖిలాజీ, దర్జా, రంగమార్తాండా, విమానం, పెద్ద కాపు 1, ప్రేమ విమానం, రాజా కార్, పుష్ప 2 వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది.
అనసూయ షాకింగ్ కామెంట్స్..
సినిమాలు, టెలివిజన్ షోలతో అలరించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే గతంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అనసూయ తన మొదటి జాబ్ గురించి మాట్లాడుతూ వచ్చింది. తను టెలివిజన్, సినీ రంగంలో అడుగు పెట్టే ముందు ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీలో పని చేశానని చెప్పింది. ఆ కంపెనీలో వెట్టి చాకిరీ చేశానని గుర్తు చేసుకుంది. అక్కడ వర్క్ చేస్తున్న సమయంలోనే సుకుమార్, మెహర్ రమేశ్, త్రివిక్రమ్ ముగ్గురు దర్శకులతోనూ పరిచయం ఏర్పడిందని చెప్పింది.
ఆ కంపెనీ జూనియర్ ఎన్టీఆర్ కంత్రి సినిమాలోని యానిమెటెడ్ జూనియర్ ఎన్టీఆర్ ను క్రియేట్ చేసిందని చెప్పింది. లార్డ్ ఆఫ్ రింగ్స్, లైఫ్ ఆఫ్ పై వంటి చిత్రాలకు కూడా తన టీమ్ వర్క్ చేసిందని గుర్తు చేసుకుంది. ఇక తన జీవితంలో ఒక్కడే బాయ్ ఫ్రెండ్ సుశాంక్ భరద్వాజ్ అని, ఆయన్నే పెళ్లి చేసుకున్నానని చెప్పడం విశేషం. ఇక జూలై 24న అనసూయ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ సందర్భంగా తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











