అలా యాంకర్ రష్మితో గ్యాప్.. జబర్దస్త్‌లో విభేదాలపై ఓపెన్ అయిన అనసూయ
తెలుగు నాట టాప్ కామెడీ షోగా దూసుకెళ్తున్న జబర్దస్త్ ప్రారంభమై.. ఈ ఏడాదితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మల్లెమాల సంస్థ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. జబర్దస్త్ 12 ఇయర్స్ మెగా సెలబ్రెషన్స్ పేరుతో గత వారం రోజుల నుంచి స్పెషల్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. జబర్దస్త్ షోలో తొలి నుంచి నేటి వరకు జడ్జిలుగా, యాంకర్లుగా, కంటెస్టెంట్స్‌గా వ్యవహరించిన అందరూ ఈ సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తున్నారు. జబర్దస్త్‌ను వీడిన చాలా మంది తమకు జీవితాన్ని ఇచ్చిన స్టేజ్ మీద పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనసూయ భరద్వాజ్ కూడా యాంకర్ రష్మి గౌతమ్‌తో బాండింగ్‌పై స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
అదిరే అభికి హైపర్ ఆది పాదపూజ
ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా సాగింది. ప్రోమో స్టార్టింగ్‌లోనే అంతా గ్రూప్ ఫోటోతో సందడి చేశారు. ఆ తర్వాత గురుశిష్యుల బంధాన్ని గుర్తుచేస్తూ కంటెస్టెంట్స్ అంతా తమ టీమ్ లీడర్స్‌కు, తమకు అవకాశాలు ఇచ్చిన వారికి కృతజ్ఞత తెలిపేలా వారి పాదాలు కడుగుతూ పాదపూజ చేశారు. తాజా ఎపిసోడ్‌లో హైపర్ ఆది తనకు జబర్దస్త్‌లో అవకాశం ఇచ్చిన అదిరే అభికి కాళ్లు కడిగి పాదాభివందనం చేశారు. నువ్వు ఏం సాధించావ్ లైఫ్‌లో అంటే ఆది నా శిష్యుడు అని గర్వంగా చెప్పుకుంటానని అభి చెప్పడంతో అంతా ఎమోషనల్ అయ్యారు.

అదిరే అభి ఎమోషనల్
జబర్దస్త్ నాకు మంచి గుర్తింపును ఇచ్చిందని.. మా అమ్మనాన్నలు ఆసుపత్రికి వెళితే ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా పేరెంట్స్‌ని చూసి మీరు చాలా అదృష్టవంతులని మీకు ఇలాంటి కొడుకు ఉన్నందుకు అని చెప్పారని అభి కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత చమ్మక్ చంద్రకు అతని శిష్యులు పాదాలు కడిగారు. ధనరాజ్, వేణు ఆర్టిస్ట్‌లు అయ్యారని చివరికి తాగుబోతు రమేశ్ కూడా అయ్యాడని నేను మాత్రం అవ్వడం లేదని ఈ డిజప్పాయింట్‌లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్‌లో అవకాశం వచ్చిందని చంద్ర గుర్తుచేసుకున్నాడు. అనంతరం రాకెట్ రాఘవని అతని శిష్యులు పాదపూజ చేసి సన్మానించారు.
నేను జబర్దస్త్ అనసూయనే
ఆ కాసేపటికీ స్టార్ యాంకర్ అనసూయ ఓ మాస్ సాంగ్‌తో స్టేజ్ మీదకు దిగడంతో అంతా ఈలలు, కేకలు వేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్లినా, ఎంత కష్టపడినా ఈ జన్మకి జబర్దస్త్ అనసూయనే అని తెలిపారు. జీవితం బోల్డెన్నీ అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ.. నేను మాత్రం తప్పకుండా ఇస్తుందనే అంటానని చెప్పింది. నేను కొన్ని ప్యాచ్ అప్స్ చేయాలని చెప్పిన ఆమె.. స్టేజ్ మీదకి వెళ్లి యాంకర్ రష్మి గౌతమ్‌ని హగ్ చేసుకున్నారు. దాంతో రష్మి, అనసూయ ఇద్దరూ చిన్న పిల్లల మాదిరిగా కన్నీటి పర్యంతమయ్యారు.
రష్మిని హగ్ చేసుకున్న అనసూయ
మా ప్యాచ్ అప్స్ వల్ల ఎవరికీ తెలియనివి కొన్ని తెలిసిపోయేలా ఉన్నాయని అనసూయ వ్యాఖ్యానించింది. అదే వాట్సాప్‌లో కానీ, ఫోన్ చేసి మాట్లాడుంటే అయిపోయేది కదా అని రష్మి చెప్పింది. అలా అయితే చాలా ఇగోలు అడ్డొస్తాయని, ఇలా అయితే చాలా బెటర్ అని అనసూయ ఆన్సర్ ఇచ్చి నవ్వేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఏళ్లుగా మాటలు లేవని రహస్యం బయటపడింది. అసలు అనసూయ, రష్మి ఎందుకు మాట్లాడుకోవడం లేదు? వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటీ? దీనిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











