Anasuya Bharadwaj: "నేను జబర్దస్త్ మానేయడానికి కారణం అదే.. పవన్ కల్యాణ్ చెప్తే ఆ పని చేస్తా"
యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన నటి అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సెన్సేషనల్ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే తాజాగా ఈమె మరోసారి షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తాను జబర్దస్త్ షో మానేయడానికి గల కారణాలను వివరించింది. అలాగే పవన్ కల్యాణ్ చెబితే ఆ పని చేసేందుకు తాను సిద్ధం అని వెల్లడించింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అనసూయ భరద్వాజ్ కెరియర్ తొలి నాళ్లలో యాంకర్ గా పని చేసింది. న్యూస్ చదివే ఆమె ఆ తర్వాత జబర్దస్త్ షోలో యాంకర్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన అందం, అభినయం, డ్యాన్సులతో బుల్లితెర ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించింది. ముఖ్యంగా హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత సినీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈక్రమంలోనే తాను జబర్దస్త్ మానేయడానికి గల అసలు కారణాలను వెల్లడించింది. జబర్దస్త్ టీం వాళ్లు తనను వెళ్లిపొమ్మనలేదని.. తానే ఆ షో నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది. జబర్దస్త్ మానేయాలి అని ఆలోచించడానికి తనకు సంవత్సరం నర సమయం పట్టిందని... అన్ని రోజుల పాటు డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. తన కెరియక్ పీక్స్ ఉన్న సమయంలో డేట్లు కుదరక జబర్దస్త్ టీం వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది.
తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలు చేస్తుండగా.. జబర్దస్త్ షోకు టైం కేటాయించలేకపోయానని అనసూయ భరద్వాజ్ వివరించింది. తన ఒక్కదాని కోసం చాలా మందిని ఆపాల్సిన పరిస్థితి వచ్చి ఓ రెండు, మూడు సార్లు తన వల్ల వారు పడుతున్న ఇబ్బందులు చూసి తనకే బాధేసిందని.. అందులో చేయనని చెప్పానని స్పష్టం చేసింది. ఇలా జబర్దస్త్ షోకు దూరం అయిన తనకు భవిష్యత్తులో చేయానిపిస్తే, కాస్త టైం దొరికిన రావాలని ఇప్పటికీ ప్రొడక్షన్ వాళ్లు అడుగుతున్నారని.. పేర్కొంది.
అలాగే ఆషోలో జడ్జిలుగా చేసిన నాగబాబు, రోజా అంటే చాలా ఇష్టం అని తెలిపింది. మరి వారిద్దరి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయాలని కోరితే ఎవరికి చేస్తారని అనగా.. నిస్సంకోచంగా జనసేన తరఫున చేస్తానని వివరించింది. పవన్ కల్యాణ్ అసలైన లీడర్ అని ఆయనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పింది. అలాగే ఆయన నీ అవసరం ఉంది, వచ్చి ప్రచారం చెయ్ అని అడిగితే కచ్చితంగా జనసేన తరఫున ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











