నాకలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు.. కష్టపడి ఎదిగా.. హీరోయిన్‌ని కాదనుకుంటున్నారా? : అనసూయ

బుల్లితెర వేదికగా కెరీర్ ప్రారంభించిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ బెస్ట్ హోస్ట్‌గా ప్రశంసలందుకుంటూనే వెండితెరపై కూడా రాజ్యమేలుతోంది. విలక్షణ పాత్రలు పోషిస్తూ ఇప్పటికే నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సినిమా సినిమాకు తన లోని నటనా ప్రతిభను మెరుగుపరుస్తూ ఆశ్చర్యపరుస్తోంది అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లల్లునా కూడా హాట్ హాట్ ఫొటోస్‌తో కవ్వించే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కి సంబందించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

మొదటగా తాను టెలివిజన్ ప్రేక్షకులకే కృతజ్ఞతలు చెబుతానని, ఎప్పుడూ వారికే రుణపడి ఉంటానని అంది అనసూయ. తాను ఎప్పుడూ స్క్రీన్‌పై ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటానని అంటోంది అనసూయ. పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటూ మనసుకు దగ్గరైన పాత్రలే చేస్తానని ఆమె చెప్పింది.

Anasuya Bharadwaj reveals sensetional issues on her life

న్యూస్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన తనకు అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా ఛాన్సులు రావడం వెనుక తన కష్టమే ఉంది తప్ప మరేదీ లేదని అంటోంది. ఇదే తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని అనసూయ చెప్పుకొచ్చింది. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎలా ఉన్నానో భవిష్యత్‌లోనూ అలాగే ఉంటానని ఈ సందర్బంగా ఆమె చెప్పింది.

ఇంటర్వ్యూలో భాగంగా అనసూయను హీరోయిన్‌గా చూడకూడదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''మీరంతా నేను హీరోయిన్‌ కాదని ఎందుకనుకుంటున్నారు. కథనం అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నాను. ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది. విజయ దేవరకొండ ప్రొడక్షన్‌ హౌజ్‌లో కూడా ఒక సినిమా చేస్తున్నా'' అని చెప్పింది అనసూయ.

Anasuya Bharadwaj reveals sensetional issues on her life

తన కుటుంబం విషయమై మాట్లాడుతూ.. అమ్మ, పిల్లలు తనకిచ్చిన గిఫ్ట్‌లు అంటే అమ్మ నాకు జన్మనివ్వడం, నేను ఇక్కడి వరకు రావడం, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవడం అంతే తప్ప వాళ్ళు సపరేట్‌గా తనకు గిఫ్ట్‌లు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడు రాలేదని పేర్కొంది అనసూయ. ఇటీవలే రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి యాక్టర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఇటీవలే వెంకీ, వరుణ్ తేజ్ ఎఫ్ 2 చిత్రంలో కూడా బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌తో అలరించిన ఈ భామకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X