Anasuya Bharadwaj: ఆంటీ అంటూ నోరుజారితే ... యాంకర్ అనసూయ పోస్ట్ వైరల్

సాధారణ న్యూస్ రీడర్ స్థాయి నుంచి సెలబ్రిటీ రేంజ్‌కి ఎదిగారు స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. ఇప్పుడు యాంకరింగ్‌కి గుడ్‌బై చెప్పి.. సినిమాలకే ఫిక్స్ అయిపోయింది. సహాయ నటిగా, విలన్‌గా, ఇతర కీలకపాత్రలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో ఒకరిగా ఉన్నారు అనసూయ. అందానికి తోడు నటన కారణంగా దర్శక నిర్మాతలు అనసూయ ముందు క్యూకడుతున్నారు. అయితే సినిమాలు, షోలు కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు అనసూయ. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ జీవితాన్ని జబర్దస్త్ కామెడీ షో మలుపు తిప్పింది. నాగబాబు, రోజాలకు తోడుగా అనసూయ తన గ్లామర్‌తో ఈ కార్యక్రమానికి ప్లస్ పాయింట్‌గా మారారు. జబర్దస్త్‌లో చేస్తున్నప్పుడే సినిమాలలో అవకాశాలు రావడంతో అక్కడా తన టాలెంట్ నిరూపించుకుని నటిగా తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. అయితే సినిమాలలో ఆఫర్లు వెల్లువలా రావడంతో తనకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చిన జబర్దస్త్ షోకు గుడ్‌బై చెప్పేసింది ఈ స్టార్ యాంకర్.

Anasuya Bharadwaj s Indirect Warning with UK Aunty Case to Trolls Goes Viral on Social Media

అనసూయను ఆంటీ అంటే అస్సలు ఆమెకు నచ్చదు. ఈ విషయంలో ఎన్నోసార్లు వివాదాలు జరిగాయి. అయినప్పటికీ అనసూయ అస్సలు సైలెంట్‌గా ఉండదు.. తన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ మండిపడుతుంది. నిన్నమొన్నటి వరకు శివాజీతో హీరోయిన్ల వస్త్రధారణపై గొడవపడిన అనసూయ.. ఆ తర్వాత తన సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆడవారి హక్కులు, ట్రోలింగ్ గురించి గట్టిగానే మాట్లాడుతూనే ఉన్నారు.

తన గురించి ఎవరైనా అభస్యంగా మాట్లాడినా.. అభ్యంతరకరంగా పోస్టులు పెట్టాని అనసూయ మండిపడతారు. ఇలాంటి వారిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసి పలు యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయించింది. సోషల్ మీడియాలోనే కాదు.. పబ్లిక్‌గానూ ఫైర్‌బ్రాండ్‌లా ఉంటారు అనసూయ భరద్వాజ్. కొద్దిరోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లగా.. కొందరు ఆకతాయిలు ఆంటీ.. ఆంటీ అని అరవడంతో ఆమె అక్కడే క్లాస్ పీకారు.

ఇక గత నెలలో హోలీ వేడుకల్లో పాల్గొన్న అనసూయను ఓ వ్యక్తి ఆంటీ అని పిలవడంతో వెంటనే మైక్ తీసుకుని.. నువ్వు ఎక్కడున్నావో నేను చూశా, దమ్ముంటే పైకి రా అంటూ చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. ఈ దెబ్బకు అంతా సైలెంట్ అయ్యారు. తాజాగా ఆంటీ అని తనను పిలవొద్దు అనేలా మరోసారి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు అనసూయ భరద్వాజ్. యూకేలో ఓ మహిళను ఓ వ్యక్తి ఆంటీ అని పిలవడంతో లండన్ కోర్ట్ దాదాపు 1.5 లక్షల రూపాయల జరిమానా విధించింది.

యూకేకు చెందిన ఐడా అనే మహిళను.. చార్లెస్ అప్పాంగ్ అనే నర్స్‌ పదే పదే ఆంటీ అని పిలిచేది. దీని కారణంగా మానసిక క్షోభను అనుభవించిన ఐడా.. కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆంటీ అని పిలవడాన్ని వయసు, లింగ వివక్ష కింద వేధింపులుగా పరిగణిస్తూ ఐడాకు 1425 పౌండ్లు (భారత కరెన్సీలో 1.5 లక్షల రూపాయలు) చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇది కాస్తా అనసూయ కంటపడటంతో ఆ న్యూస్ క్లిప్‌ను అనసూయ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి మద్ధతుగా హమ్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే మీకు కూడా ఇదే గతి పడుతుందని ట్రోలర్స్‌కు ఇ‌న్‌డైరెక్ట్‌గా అనసూయ వార్నింగ్ ఇచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X