యాంకర్ అనసూయపై పుకార్లు.. ఎట్టకేలకు తెరదించుతూ, కేక పెట్టించిన వర్షిణి!
Recommended Video

యాంకర్ అనసూయ ప్రస్తుతం క్రేజీ సెలెబ్రిటీ. అటు బుల్లి తెరపై, ఇటు వెండి తెరపై మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. గ్లామరస్ యాంకర్‌గా అనసూయ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అందంతో పాటు చలాకీతనం కూడా ఉండడంతో అనసూయ యాంకర్‌గా, నటిగా దూసుకుపోతోంది. జబర్దస్త్ షోకు ఆడియన్స్‌లో ఎలాంటి స్పందన లభిస్తుందో అందరికి తెలుసు. అలాంటి పాపులర్ షోకు చాలా కాలంగా అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఇటీవల అనసూయ జబర్దస్త్‌లో కనిపించకపోవడంతో అనేక పుకార్లు మొదలయ్యాయి. ఎట్టకేలకు ఆ పులర్లన్నింటికీ తెర పడింది.

కనిపించిన అనసూయ
కొన్ని వారాలుగా జబర్దస్త్ షోలో అనసూయ కనిపించడం లేదు. అనసూయ స్థానంలోకి కొత్త యాంకర్ వర్షిణి వచ్చింది. దీనితో అనసూయ జబర్దస్త్ కు దూరమైనట్లు వార్తలు జోరందుకున్నాయి. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలతో వివాదం అని కూడా ప్రచారం జరిగింది. మరి కొంత మంది అనసూయ తాత్కాలికంగా మాత్రమే షోకు దూరమైందని తెలిపారు. ఇలా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో జబర్దస్త్ కు అనసూయ రీఎంట్రీ ఇచ్చింది.

తొలగిన అనుమానాలు
గత గురువారం అనసూయ జబర్దస్త్ షోకు తిరిగి వచ్చింది. దీనితో సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లకు తెరపడ్డట్లు అయింది. అనసూయ కేవలం బిజిస్ షెడ్యూల్ కారణంగానే కొన్ని వారాలు జబర్దస్త్ కు దూరమైందని ఆమె సన్నిహితులు కక్లారిటీ ఇచ్చారు. అనసూయ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా గడుపుతోంది. అందులో రెండు చిత్రాల్లో అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇటీవల ఆ చిత్రాలకు సంబంధించిన బిజీ షెడ్యూల్ కారణంగా కొంతకాలం జబర్దస్త్ ని పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది.

నిర్మాతలతో అంగీకారం
బిజీ షెడ్యూల్ విషయాన్ని అనసూయ జబర్దస్త్ టీంకు , నిర్మాతలకు తెలియజేయగా వారు అంగీకారం తెలిపారు. దీనితో అనసూయ దూరమయ్యే కొన్ని వారాలపాటు యాంకర్‌గా వర్షిణిని రంగంలోకి దించారు. అనసూయ నటిస్తున్న చిత్రాల కీలక షెడ్యూల్ పూర్తి కావడంతో తిరిగి వచ్చింది. దీనితో తాత్కాలిక యాంకర్ అయిన వర్షిణి తప్పుకుంది. రంగస్థలం చిత్రం తరువాత అనసూయకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ఆ చిత్రంలో రంగమత్తగా అనసూయ ఎప్పటికీ గుర్తుండిపోయే నటన కనబరిచింది.

కేక పెట్టించిన వర్షిణి
జబర్దస్త్ లోకి తాత్కాలిక యాంకర్ గా వచ్చిన వర్షిణి కేకపెట్టించింది. కేవలం కొన్ని వారాలతోనే క్రేజీ యాంకర్ మారిపోయింది. వర్షిణి యాంకరింగ్ కు, అందానికి యువత ఫిదా అయ్యారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వర్షిణి ఫోటోలు వైరల్ అవుతున్నారు. జబర్డస్త్‌లో వర్షిణి అనసూయని మురిపించేలా యాంకరింగ్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెరపై మరో క్రేజీ యాంకర్ వచ్చిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











