ఉప్పుకారం తింటే, ధైర్యం ఉంటే.. మీడియాకు అనసూయ పాఠాలు..రంగమ్మత్త శ్రీరంగ నీతులు

టెలివిజన్ యాంకర్, హోస్ట్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి మీడియాపై, వెబ్‌సైట్లపై నోరు పారేసుకొన్నది. యువ హీరో విజయ్ దేవరకొండ‌ను అకారణంగా టార్గెట్ చేస్తూ పరోక్షంగా ట్వీట్లతో సెటైర్లు వేసిన ఆమెను ఇటీవల నెటిజన్లు, ఫ్యాన్స్‌ మాటల్లో చెప్పలేని విధంగా ట్రోల్ చేశారు. అయితే అనసూయ కూడా నెటిజన్ల స్థాయికి దిగజారి వారితో సోషల్ మీడియాలో స్ట్రీట్ ఫైట్‌ను మరిపించే విధంగా బాహాబాహికి దిగింది. అయితే అనసూయ వ్యవహారాన్ని, నెటిజన్ల ట్రోల్స్‌ను రిపోర్టు చేసిన మీడియాకు నీతులు, పాఠాలు చెప్పేందుకు వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే...

సోషల్ మీడియాలో నోటి దురుసు:విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం ఖుషీ ప్రమోషనల్ మెటీరియల్‌‌లో తన పేరు ముందు The అని రాసుకోవడంపై అనసూయ తన ట్వీట్టర్ అకౌంట్‌లో నోటి దూలను ప్రదర్శించింది. బాబోయ్ పైత్యం అంటూ కామెంట్ చేయడంతో సదరు హీరో అనుకూల వర్గం ఆమెను ట్రోల్స్‌తో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆమె కూడా అంతే స్థాయికి దిగజారి వారితో ముష్టి యుద్దానికి దిగింది.

ముసుగులో గుద్దులాట వద్దు:అయితే విజయ్ దేవరకొండపై చేసిన పరోక్ష కామెంట్స్‌పై తనదేమీ తప్పు లేదు. నా అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించాను అంటూ వీడియోలో తనకు తాను సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేసింది. వీడియోలో మాట్లాడుతూ. హాయ్..అందరికి.. చాలా రోజులైంది.. ఇలా లైవ్‌లోకి వచ్చి.. ఎక్కువగా నసపెట్టను. ముసుగులో గుద్దులాడను. అంటూ తన పిలకను సవరించుకొంటూ అంటూ వీడియోలో అనసూయ ప్రవచనాలు మొదలుపెట్టింది.

Anasuya Bharadwajs Video, satires on Media goes Viral

మా మీద రాస్తూ పొట్ట నింపుకొనే వాళ్లు అంటూ :వీడియో లైవ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే? వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్.. ఎవరైతే మాలాంటి పబ్లిక్ ఫిగర్స్, ఫేమస్ వాళ్ల గురించి.. వాళ్ల మీదే రాస్తూ పొట్ట నింపుకొనే వాళ్ల గురించి చెప్పదలచుకొన్నాను. అనసూయను వేసుకొన్నారు. సో అండ్ సో ఫ్యాన్స్ ఏడిపించారు. ట్రోల్స్ చేశారు అనేది కాదు. మీకు ఇంకా దునియా దారి తెలియదు కాబట్టి చెబుతున్నాను. మీకు క్లారిటీ ఇస్తున్నాను అంటూ అనసూయ పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు.

Anasuya Bharadwajs Video, satires on Media goes Viral

ఉప్పుకారం తిని ఉంటే.. :అనసూయ ఇంకా తన వీడియోలో మాట్లాడుతూ.. పడ్డవాళ్లు చెడ్డవాళ్లు కాదు..అన్నవాడే నోరు కంపు. మీకు ధైర్యం ఉంటే.. ఉప్పుకారం తిని ఉంటే.. నిజం రాయండి. నేను ధైర్యంగా చెప్పడం జరిగింది. చేతకానీ వాళ్లు. అదుపు తప్పారు అని మీరు రాయాల్సిన థంబ్ నెయిల్. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అని అనసూయ నీతులు వల్లించింది.

Anasuya Bharadwajs Video, satires on Media goes Viral

మీడియా ప్రోత్సాహం మరిచిందా?:అయితే అనసూయ అతిగా మీడియా, వెబ్‌సైట్లపై నోరుపారేసుకోవడంపై సీనియర్ జర్నలిస్టులు ఘాటుగా స్పందిస్తున్నారు. చిన్న చితక వేషాలు వేస్తూ.. జబర్దస్త్ లాంటి షోలో ఆమె ఫెర్ఫార్మెన్స్ నుంచి.. మంచి పాత్రలు చేసినప్పటి వరకు మీడియా,వెబ్ సైట్లు నాలుగు మంచి మాటలు రాసిన విషయాన్ని అనసూయ మరిచిపోయింది అని జర్నలిస్టులు ప్రస్తావిస్తున్నారు.

Anasuya Bharadwaj

మీడియాపై అవాకులు..చెవాకులా?:మీడియా, వెబ్ సైట్లు రాసిన మంచి మాటల వల్లే నాలుగు రాళ్లు వెనకేసుకొంది. నాలుగు వేషాలు ఆమెకు వస్తున్నాయంటే మీడియా వల్లే. వెబ్‌సైట్ల ప్రోత్సాహం వల్లే పొట్ట నింపుకొంటున్నది. మీడియాపై అవాకులు, చెవాకులు పేలుతూ.. మీడియా తనకు అనుకూలంగా ఎలా రాయాలో.. వ్యతిరేకంగా ఎలా రాయవద్దో అని చెప్పడం అనసూయ అవివేకమా?, అజ్ఞానమా? ట్రోల్స్‌తో వివేకం కోల్పోయిందా? అనే విషయం చర్చనీయాంంశమైంది. వెయ్యి రాబందులు తిన్న అదేదో.. కాశీకి పోయి..ఏదేదో చేసిందనే సామెత గుర్తుకు వస్తుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X