రాముడి లాంటి మా ఆయన స్థానంలో ఇలాంటి వాడిని పెట్టారా.. అనసూయ వార్నింగ్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ అనే పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు తొలుత న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అతి కొద్ది కాలంలోనే ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారి తెలుగు యాంకర్స్ లో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది.. తాజాగా జబర్దస్త్ ప్రోమో లో అనసూయ కామెడీ పండిస్తూనే సీరియస్ అయింది. తన భర్త రాముడి లాంటి వాడు అయితే ఇలాంటి వాడిని చూపిస్తున్నారు ఏంటి అంటూ ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

కొత్త మొహం కావాలని
చదువుకునే రోజుల్లో సొంతం అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన అనసూయ ఆ తరువాత చదువు పూర్తి చేసిన తర్వాత ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. అదే సమయంలో జబర్దస్త్ షో ప్రారంభం అవుతున్న సమయంలో కొత్త మొహం కావాలని మల్లెమాల సంస్థ ప్రయత్నిస్తుండగా అప్పుడే అనసూయ తారసపడింది.

సెలబ్రిటీ హోం టూర్
అలా ఈ షోలో కి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన అప్పటి నుంచి అనసూయ తనదైన శైలిలో ఆసక్తికరంగా యాంకరింగ్ చేస్తూ వస్తోంది. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో అనసూయ కాస్త హాస్యం పండిస్తూనే సీరియస్ అయింది. రైజింగ్ రాజు టీం షోలో భాగంగా ఒక స్కిట్ వేశారు. ఈ స్కిట్ లో పరదేశి ఐశ్వర్య ఉల్లింగలతో కలిసి సెలబ్రిటీ హోం టూర్ ప్లాన్ చేస్తాను అని అంటాడు. ఈ హోమ్ టూర్ లో భాగంగా అనసూయ ఇంటికి వెళుతున్నట్లు చూపిస్తారు.

అనసూయ ఫైర్
అనసూయ పాత్రలో రైజింగ్ రాజు నటిస్తూ నైటీ వేసుకుని నవ్వులు పూయించాడు. ఇదే సమయంలో అనసూయ భర్త భరద్వాజ్ అని పిలుస్తూ ఉంటే ఆయన స్థానంలో దొరబాబు ఎంట్రీ ఇస్తాడు. దీంతో రాముడు లాంటి మా ఆయన స్థానంలో దొరబాబు ని పెట్టడం ఏంటి అని అని అనసూయ ఫైర్ అయింది.. దీంతో పరదేశి ఈ హోమ్ టూర్ వైలెంట్ అయ్యేలా ఉంది అంటే మీరు ఆపకపోతే నిజంగానే వైలెంట్ అవుతుంది అంటూ ఆమె వార్నింగ్ ఇస్తుంది.

ఏ గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్
మొత్తానికి ఈ ప్రోమో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి దొరబాబు అప్పట్లో వ్యభిచారం కేసులో విశాఖపట్నంలో అరెస్టు కావడంతో అప్పటి నుంచే ఆ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుని హైపర్ ఆది కూడా పెద్ద ఎత్తున జోకులు వేస్తూ ఉంటాడు. అదీకాక దొరబాబు అంతకు ముందు కాస్త ఏ గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో అతనికి కాస్త అమ్మాయిల వీక్నెస్ ఉంది అన్నట్టు అతని మీద జోకులు రాసుకుని నవ్విస్తూ ఉంటారు.

దాక్షాయణి అనే పాత్రలో
మరోపక్క అనసూయ విషయానికి వస్తే ఆమె ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సినిమాలు చేస్తోంది. పుష్ప సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో నటించిన ఆమె అందరినీ మెప్పించింది. ప్రస్తుతం ఆమె దర్జా అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ద్వారా మరింత క్రేజ్ లభిస్తుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











