ఆ ఇద్దరి మధ్య నలిగిపోయా.. ప్రేమ, పెళ్లిపై అనసూయ ఎమోషనల్
అనసూయ భరద్వాజ్.. పరిచయం అక్కర్లేని పేరు. ఓ సాధారణ న్యూస్ రీడర్ స్థాయి నుంచి దక్షిణాదిలో డిమాండ్ ఉన్న నటిగా, స్టార్ సెలబ్రిటీగా ఎదిగిన వ్యక్తి. జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్ అయినా ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలతో సత్తా చాటారు. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. మనసులో ఏమున్నాసరే కుండబద్ధలు కొడతారు. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా ఆమె లెక్కచేయదు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ జీవితంలో ఎదురైన కష్టాల గురించి అనసూయ పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌కు చెందిన అనసూయకు కాలేజీ రోజుల్లోనే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. చదువు తర్వాత ఐడీబీఐ బ్యాంక్‌లో ఆమె పనిచేశారు. అనంతరం పిక్స్‌లాయిడ్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేశారు. ఈ దశలో తెలుగు వార్తా సంస్థ సాక్షి టీవీలో న్యూస్ రీడర్స్ కావాలన్న ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ప్రతిభ, అందం చూసిన సాక్షి టీవీ యాజమాన్యం న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా అవకాశం కల్పించింది. ఆ తర్వాత మా మ్యూజిక్‌కి యాంకర్‌గానూ పనిచేసింది అనసూయ.

ఈ క్రమంలో ఈటీవీలో ప్రారంభమైన జబర్దస్త్‌కు యాంకర్‌గా అవకాశం రావడం అనసూయ జీవితాన్ని మలుపు తిప్పింది. కమెడియన్ల అల్లరితో పాటు అనసూయ అందం ఈ షోకు ప్లస్‌గా మారాయి. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సమయంలోనే సినీరంగం నుంచి కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. రంగస్థలం, క్షణం, పుష్ప, రంగమార్తాండ తదితర సినిమాలలో అనసూయ అద్భుతంగా నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అలా సినిమాలు, షోలు, సోషల్ మీడియా, ఈవెంట్స్, ఓపెన్సింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు అనసూయ.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని వివాదాల్లోనూ ఆమె ఇరుక్కున్నారు. తీరిక వేళల్లో తన భర్త, పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తూ దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఉంటారు ఈ ముద్దుగుమ్మ.
అనసూయ జీవితంలో సుశాంక్ భరద్వాజ్‌తో పరిచయం, ప్రేమ, పెళ్లి కీలక మలుపు అని ఆమె పలుమార్లు తెలిపారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ జీవితంలో ఎదురైన కష్టాలను బయటపెట్టారు. మీది లవ్ మ్యారేజా? అరెంజ్డ్ మ్యారేజా అని యాంకర్ అడగ్గా.. లవ్ మ్యారేజేనని అనసూయ ఆన్సర్ ఇచ్చారు. కాకపోతే ఇంట్లో ఒప్పించడానికి చాలా కష్టమైంది. మా నాన్నకు, మా ఆయనకి మధ్యలో నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మా ఆయన కొంచెం అగ్రెసివ్‌గా లేడు.. మీ అమ్మానాన్న ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుందామని ఓపిక పట్టాడు. అక్కడ నాకు కొంచెం రిలీఫ్ దక్కింది. పెళ్లి కోసం మా ఆయన నుంచి ప్రెజర్ లేదు.. ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుందామని చెప్పేవారు. ఈ ఓపిక ఈ జనరేషన్ పిల్లలకు లేదని అనసూయ భరద్వాజ్ తెలిపారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి 2010లో సుశాంక్ భరద్వాజ్- అనసూయలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు అయాన్ష్ భరద్వాజ్, శౌర్య భరద్వాజ్ సంతానం. అనసూయ యాంకర్‌గా, నటిగా బిజీగా ఉంటున్నారు. ఇక సుశాంక్ ఓ కార్పోరేట్ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. కానీ సెలబ్రిటీకి భర్త అయినప్పటికీ మీడియాకు దూరంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు సుశాంక్. ఆయన ప్రొఫెషనల్ బైకర్, అంతేకాదు మంచి గిటారిస్ట్ కూడా. తన భార్య అనసూయకు అన్ని రకాలుగా అండగా నిలుస్తూ.. ఆమె ఎదుగుదలలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు సుశాంక్.


Click it and Unblock the Notifications



