స్లీవ్లెస్ బ్లౌజ్ తో అందాలు ఆరబోస్తున్న అనసూయ అక్కడి టాటూని కూడా చూపించేస్తూ!
ఇటీవల పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనసూయ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తోంది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఇప్పుడు నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీడియోలో ఆమె స్లీవ్ లెస్ టాప్ వేసుకొని కనిపిస్తూ ఉండగా కాస్త విచిత్ర వేషధారణలో కనిపిస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

దాక్షాయణి అనే పాత్రలో
జబర్దస్త్ యాంకర్ గా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న అనసూయ సినిమాలలో కూడా వరుస అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్ర బాగా క్లిక్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అందులో భాగంగానే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప అనే సినిమాలో కూడా సునీల్ భార్య దాక్షాయణి అనే పాత్రలో నటించిన ఆమె మరింత క్రేజ్ సంపాదించింది.

ఖిలాడీ అనే సినిమాలో
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగంలో ఆమె రోల్ మరింత నిడివితో కూడి ఉంటుందని చెబుతున్నారు. ఆ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. మరో పక్క ఆమె ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ అనే సినిమాలో కూడా రెండు పాత్రల్లో నటించింది. చంద్రకళ అనే ఒక పాత్రలో అలాగే చాందిని అనే మరో పాత్రలో కూడా కనిపించి ప్రేక్షకులను అందరికీ షాక్ ఇచ్చింది.

మంచి ఫాంలో
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా అనసూయకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఆమె పాత్రలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టే అవకాశం ఉండటంతో ఆమె ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారనే చెప్పాలి.

సైలెంట్గా
మామూలుగానే ఎప్పటికప్పుడు అనసూయ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్లతో తన ఫోటోలతో ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ను కూడా ఆమె అభిమానుల కోసం అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. అయితే ఎవరైనా ఆమె ఫోటోల మీద నెగటివ్ కామెంట్లు పెడితే వారికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తూ ఆమె మీద కామెంట్ చేయటం కంటే ఆమె ఫోటోలు చూసి సైలెంట్గా ఉండి పోవడమే బెటర్ అనిపించేలా చేస్తుంది.
Recommended Video
హాట్ టాపిక్ గా
అయితే ఇప్పుడు తాజాగా అనసూయ షేర్ చేసిన ఒక వీడియో హాట్ టాపిక్ గా మారింది, ఎందుకంటే ఈ వీడియోలో ఆమె వేషధారణ కాస్త విచిత్రంగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా పూర్తిగా డార్క్ లిప్స్.. ముక్కుకి ముక్కెర.. స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని ఎద అందాలు ఆరబోస్తూ నెటిజన్లను కవ్విస్తోంది. అలాగే ఆ వీడియోలో ఆమె నడుస్తూ మేనరిజమ్స్ చూపిస్తూ మరింత వీడియోకు అందం తీసుకువచ్చింది. అంతేకాక వీడియోలో తన అందాలను క్లోజప్ యాంగిల్లో చూపిస్తూ తన ఎద మీద ఉన్న ఒక టాటూ కూడా చూపించడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











