జబర్దస్త్‌కు యాంకర్ అనసూయ గుడ్‌బై.. ఎమోషనల్ పోస్టుతో క్లారిటీ
యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ ప్రస్తుతం అటు నటిగా, ఇటు యాంకర్ గా రెండు చేతులా మంచి మంచి సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ ఇప్పుడు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అనసూయ సోషల్ మీడియాలో అసలేం పోస్ట్ చేసింది. ఈ చర్చ ఎందుకు మొదలయింది. అనే వివరాల్లోకి వెళితే..

యాంకర్ గా
చదువుకునే రోజుల్లోనే సొంతం అనే సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన అనసూయ భరద్వాజ్ చదువు పూర్తి చేసి ఒక న్యూస్ ఛానల్ న్యూస్ ప్రజెంటర్ గా ఉద్యోగంలో చేరింది. అనుకోకుండా ఎంటర్టైన్మెంట్ యాంకర్ కావాలనే ఒక ప్రకటన చూసి మల్లెమాల సంస్థ నిర్వహిస్తున్న జబర్దస్త్ ఆడిషన్స్ కి వెళ్లడంతో ఆమెకు అక్కడ యాంకర్ గా అవకాశం లభించింది. అక్కడ ఆమె నిలదొక్కుకోవడంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

సినీ అవకాశాలు
జబర్దస్త్ యాంకర్ గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. మధ్యలో కూడా ఆమెకు ఏదైనా అవసరమై కొన్ని రోజులు తప్పుకుంటే రశ్మితో మేనేజ్ చేశారు. అలా ఆమెను కూడా మరో స్టార్ యాంకర్ గా మార్చేసింది మల్లెమాల సంస్థ. అయితే అనసూయ భరద్వాజ్ కూడా సంస్థను వదిలిపెట్టకుండా అలాగే ఉండడంతో ఇద్దరినీ కూడా మేనేజ్ చేస్తూ వస్తుంది మల్లెమాల సంస్థ. ఇప్పుడు అనూహ్యంగా అనసూయకు వరుస సినీ అవకాశాలు లభిస్తున్నాయి.

రంగమ్మత్త అనే పాత్రతో
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రతో మరింత క్రేజ్ సంపాదించింది. అనసూయను దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకునే దర్శకుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఆమె చేస్తున్న సినిమాలు, చేసిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తాజాగా అనసూయ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకున్నానని అందుకే మిశ్రమ ఫీలింగ్స్ కలుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది.

భవిష్యత్తులో
ఎన్నో ఆనందకరమైన క్షణాలు, కొన్ని బాధాకర ఘటనలకు కొన్ని వికారమైన ఘటనలను గుర్తుచేస్తోంది అంటూ తాను ప్రస్తుతం మిక్సిడ్ ఎమోషన్స్ అనుభవిస్తున్నాను అంటూ ఆమె సోషల్ మీడియాలో పేర్కొంది. భవిష్యత్తులో ఎదురుచూస్తున్న విషయాల కోసం ముందుకు వెళతానని ఆమె పేర్కొంది. ఇక ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో అలాంటి సపోర్ట్ భవిష్యత్తులో కూడా లభిస్తుందని భావిస్తున్నానని ఆమె పేర్కొంది.
Recommended Video


జబర్దస్త్ వదిలేస్తున్నాను అని
అయితే ఎక్కడా కూడా ఆమె జబర్దస్త్ వదిలేస్తున్నాను అని కామెంట్ చేయకపోయినా ఇంత బాధాతప్త హృదయంతో భారీ ఎమోషనల్ నోట్ షేర్ చేయడంతో ఇలాంటి పెద్ద నిర్ణయం ఏదో ఉండే ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. అయితే ఆమె నిజంగానే జబర్దస్త్ కి గుడ్ బై చెబుతున్నారా లేక మరేదయినా కీలక నిర్ణయం తీసుకున్నారా అనే విషయం మీద ఆమె క్లారిటీ ఇస్తే గాని తెలిసే అవకాశం లేదు. మంచి స్టార్స్ అనుకున్న అందరూ ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్న నేపథ్యంలో అనసూయ కూడా తప్పుంటే అది జబర్దస్త్ కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











