శ్రీలంకలో అనసూయ బికినీ షో.. స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో డీప్ రొమాన్స్
స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ ఇటీవల తన ఇంట్లో వరుస శుభకార్యాలతో బిజీగా ఉన్నారు. సినిమాలు, టెలివిజన్ షోలతో బిజీగా ఉన్నప్పటికీ ఇల్లాలిగా తన బాధ్యతలను సైతం సక్రమంగా నిర్వహిస్తున్నారు అనసూయ. తీరిక కుదిరినప్పుడల్లా తన భర్త, పిల్లలు, కుటుంబంతో గడిపేందుకు రంగమ్మత్త ఇంట్రెస్ట్ చూపిస్తారు. తాజాగా అనసూయ తన కుటుంబంతో కలిసి శ్రీలంక టూర్‌కి వెళ్లారు. ఈ వివరాల్లోకి వెళితే..
కెరీర్‌లో పీక్స్‌లో అనసూయ
జబర్దస్త్ షోతో తెలుగునాట పాపులరైన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు. యాంకరింగ్‌ను పూర్తిగా పక్కనపెట్టేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిలిచారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో ఆమె నటిస్తుండగా.. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. కొన్ని ఛానెల్స్‌లో వస్తున్న రియాలిటీ షోలకు అనసూయ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా అనసూయ ఇప్పుడు పీక్స్‌లో ఉన్నారు.

ఇటీవలే కొత్తింటిలోకి అనసూయ
ఇటీవలే హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన అనసూయ భరద్వాజ్.. తన అభిరుచికి అనుగుణంగా అందులో మార్పుచేర్పులు చేయించారు. అనంతరం తన భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి కొత్తింటిలో అడుగుపెట్టారు. దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా. ఆ ఇంటికి తన ఇష్టదైవం ఆంజనేయుడి పేరు కలిసొచ్చేలా శ్రీరామ సంజీవని అని పేరు పెట్టుకున్నారు అనసూయ. అలాగే శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం జరిపించారు.
అనసూయ ఇంటికి హనుమంతుడు
ఇక గృహ ప్రవేశం సందర్భంగా అనసూయ- సుశాంక్ దంపతులు ఇంట్లో నిర్వహించిన హోమంలోని మంటల్లో ఆంజనేయుడి రూపం కనిపించడంతో ఆమె పొంగిపోయారు. తాను చిన్నప్పటి నుంచి హనుమంతుడి భక్తురాలినని.. తనకు కష్టమైనా, సుఖమైనా ఆయనను తలచుకుంటానని పలుమార్లు తెలిపారు రంగమ్మత్త. అలాంటిది ఏకంగా హనుమంతుడు తన ఇంటికి రావడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
పెద్ద కొడుక్కి ఉపనయనం
గృహ ప్రవేశం జరిగి రోజులు గడవకముందే మరో శుభకార్యాన్ని నిర్వహించారు అనసూయ- సుశాంక్ దంపతులు. తన పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు ఉపనయన కార్యక్రమాన్ని జరిపించారు. సాంప్రదాయ పద్ధతిలో తంతు నిర్వహించారు. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను భవిష్యత్ తరాలకు అందించేలా మాకు అనుమతించినందుకు ధన్యవాదాలు అంటూ అనసూయ ఈ క్రతువు గురించి పోస్ట్ పెట్టారు.
శ్రీలంక ట్రిప్‌లో అనసూయ ఫ్యామిలీ
ప్రతియేటా వీలు చూసుకుని వెకేషన్‌కు వెళ్లడం అనసూయకి అలవాటు. ఈ నేపథ్యంలో తన భర్త, పిల్లలతో కలిసి శ్రీలంక ట్రిప్ వేశారు అనసూయ. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ట్రింకోమలైలోని శాంకరీ దేవి శక్తి పీఠాన్ని వీరు సందర్శించారు. అలాగే అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించి, శ్రీలంక వంటకాలను రుచి చూశారు. తొలిరోజు పద్ధతిగా పంజాబీ, చుడీదార్‌లో కనిపించిన అనసూయ ఆ వెంటను రెచ్చిపోయారు. బికినీ వేసుకుని, టాప్ లెస్ అందాలతో స్విమ్మింగ్‌పూల్‌లో కనువిందు చేశారు. భర్తతో కలిసి రొమాంటిక్ మూవ్‌మెంట్స్ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











