అనసూయ ఇంటికి హనుమంతుడు.. ఫ్యామిలీ మొత్తం షాక్‌లోనే.. ఆధారాలు ఇవిగో!
టీవీ షోలు, సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న స్టార్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ ఇటీవల హైదరాబాద్‌లో ఓ లగ్జరీ ఇంట్లో గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. నిత్యం షూటింగ్స్, మేకప్స్ అంటూ బిజీగా ఉండే అనసూయ .. తన ఇంట్లో శుభకార్యం కావడంతో పూర్తిగా కుటుంబానికే కేటాయించారు. పూజలు, వ్రతంతో పాటు బంధుమిత్రులతో గడుపుతున్నారు అనసూయ. ఈ నేపథ్యంలో అనసూయ ఇంటికి ఓ విశిష్ట అతిథి వచ్చారు ఈ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్‌తో లైఫ్ టర్న్
జబర్దస్త్ కామెడీ షోతో పాపులరైన అనసూయ భరద్వాజ్ ఈ తర్వాత సినిమాల్లోనూ అడుగుపెట్టి ఇప్పుడు సినిమాలతోనే గడుపుతున్నారు. తనకు జీవితాన్ని, పేరు ప్రఖ్యాతులను ఇచ్చిన జబర్దస్త్‌ను సైతం అనసూయ వదిలి పెట్టేశారు. దీనికి కారణం ఏంటనేది ఇంత వరకు తెలియదు. మల్లెమాలతో విభేదాలని కొందరు.. కమెడియన్స్ ఓవరాక్షన్ అని మరికొందరు ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారు కథనాలను అల్లేస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటనేది ఎవరు చెప్పరు?

సినిమాలలో అనసూయ బిజీ
అటు అనసూయ మాత్రం వరుసపెట్టి సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ లీడ్ రోల్స్ పోషించే స్థాయికి చేరుకున్నారు. తొలుత గ్లామర్ రోల్స్‌తో అలరించినా ఇప్పుడిప్పుడే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తున్నారు అనసూయ. రజాకార్, పుష్ప సిరీస్‌లో ఆమె నటన హైలైట్‌గా నిలిచింది. ఈ మే 15న 40వ వసంతంలోకి అడుగుపెట్టిన అనసూయ గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి రెండ్రోజుల ముందే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ
అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి గత సోమవారం తన భర్త సుశాంక్ భరద్వాజ్, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఆ ఇంటికి శ్రీరామ సంజీవని అనే పేరు పెట్టుకున్నారు. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించడం తెలుగువారి సాంప్రదాయం. దీనికి అనుగుణంగానే అనసూయ కూడా భర్తతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. తమ గురువు గారి సూచనల మేరకు శ్రీరామ సంజీవని అని ఇంటికి పేరు పెట్టుకున్నామని అనసూయ తెలిపారు. అయితే ఇంట్లో హోమం చేయిస్తుండగా ఆంజనేయుడు వచ్చాడని గురువుగారు చెప్పారని, హోమ గుండంలోని మంటల్లో ఆంజనేయుడి ఫోటోను తమకు చూపించారని అనసూయ తెలిపారు.
హనుమంతుడిని చూసి షాక్‌లో అనసూయ
హనుమంతుడిని చూసిన వెంటనే అనసూయ భావోద్వేగానికి గురై షాక్‌లో ఉండిపోయారు. ఆమె భర్త సుశాంక్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పొంగిపోయారు. ఇదే సమయంలో తన చిన్నప్పటి నుంచి నాన్నగారి ప్రేరణతో కష్టమైనా, సుఖమైనా, సందర్భం ఏదైనా సరే జైహనుమాన్ అని తలచుకుంటానని ఆనసూయ రాసుకొచ్చారు. హనుమంతుడిని తాను తండ్రిగా భావించే ఆయన పేరుని తన పెద్ద కొడుకుని పెట్టుకున్నానని తెలిపారు. అలాంటిది హనుమంతుడు మమ్మల్ని ఆశీర్వదించడానికి , మా ఇంటికి వచ్చాడని తెలిసి నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నానని అనసూయ రాసుకొచ్చారు. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











