ఎదపై టాటూ కనిపించేలా హాట్ ఫోజులతో అనసూయ.. ఇంతకీ ఆ టాటూ అర్థమదేనా.. లేక?
అందాలతో మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. బుల్లితెర, వెండితెరనే కాదు నెట్టింట కూడా అమ్మడి అందాలు అదరగొడుతూనే ఉంటాయి. సాయంత్రం అయిందంటే జబర్దస్త్ షోలో అమ్మడి అందాలే అందరికీ స్పెషల్ ట్రీట్. కేవలం అందంగా ఉండటమే కాదు అందుకు తగ్గట్టుగా చలాకీగా ఉండటం ఆమె ప్రత్యేకత. అందుకే అనసూయకు స్టార్ హీరోయిన్లకున్నంత భారీ ఫాలోయింగ్ ఉంటుంది. కాగా తాజాగా ఆమె తన ఎద అందాలను, దానిపై ఉన్న టాటూను ఫుల్లుగా ఫోకస్ చేస్తూ ఫోటో షూట్ లో పాల్గొంది. అంతేకాదు వెంటనే అదే డ్రెస్ తో జబర్దస్త్ వేదికపై హంగామా చేసింది. దీంతో మరోసారి అనసూయ ఎద అందాలు, టాటూపై చర్చ మొదలైంది జనాల్లో.
ఓ వైపు హాట్ యాంకర్‌గా టీవీ షోస్.. మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామకు రెగ్యులర్‌గా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓ హాబీ. ఈ నేపథ్యంలో తాజాగా తన ఎదపై ఉన్న టాటూను చూపిస్తూ ఫ్యాషన్ లుక్ ఇచ్చింది అనసూయ. నిజానికి గతంలోనే అనసూయ ఈ టాటూ వేయించుకుంది కానీ దాన్నే ఇంతగా ఫోకస్ చేసి చూపించిన సందర్భాలు లేవు. దీంతో ఇది అప్పటిదేనా లేక ఆ టాటూ చెరిపేసి మరేదైనా వేసేసిందా? అనే చర్చ మొదలైంది. కాగా ఆమె ఎదపై కనిపించిన ఈ టాటూలో తన భర్త సుసాంక్ భరద్వాజ్ పేరును షార్ట్ కట్‌గా వేయించుకున్నట్టు చాలా రోజుల క్రితమే తెలిసింది. ఎలాగైతేనేం మొత్తానికి మరోసారి టాటూతో మాయ చేసి జనాల నోళ్ళలో నానుతోంది హాట్ భామ అనసూయ.

ఇక అనసూయ సినిమాలంటారా..! వెండితెరపై కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ మెప్పించడం ఆమె స్టైల్. ఈ కోవలోనే క్షణం,రంగస్థలం సినిమాలతో మంచి నటిగా అనసూయ గుర్తింపు పొందింది. మరికొద్ది రోజుల్లో కథనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో రానున్న కొత్త సినిమాలో ముఖ్యపాత్ర చేయడానికి అనసూయ ఓకే చెప్పేసిందట.


Click it and Unblock the Notifications