Anasuya Bharadwaj: 'అమ్మాయిలు సిగ్నల్ ఇస్తే చాలు.. రెండుమూడు నిమిషాల్లోనే..'

Anasuya Bharadwaj: నటి, యాంకర్ అనసూయ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె క్రేజ్ అలాంటి..ఆమె ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ అటు బుల్లి తెర, ఇటు వెండి తెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. వాస్తవానికి జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు.. ప్రస్తుతానికి యాంకరింగ్ మానేసి పూర్తిగా నటనపై ఫోకస్ పెట్టింది. ఇటీవల అనసూయ కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు తెగవైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.

అనసూయ భరద్వాజ్ తొలిసారి 'సొంతం' అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఓ ప్రముఖ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టి యాంకరింగ్ చేస్తూ వచ్చింది. ఆ జబర్దస్త్ షో ద్వారా అనసూయకు పేరు వచ్చిందో.. అనసూయ వల్ల జబర్దస్ కు పేరు వచ్చిందో తెలియదు. కానీ, ఆమె దశదిశ రెండు మారాయి. ఈ షో ద్వారా వచ్చిన వల్ల అనసూయకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెట్ కు జీవం పోసింది అనసూయ. దీంతో ఆమె మంచి పాపులర్టీని సొంతం చేసుకుంది. తర్వాత పుష్ప సినిమాతో కూడా క్రేజ్ అందుకున్న అనసూయ. ఈ మూవీ తన నట విశ్వరూపాన్ని చూపించింది.

Anasuya Bharadwaj shocking Comments on Casting Couch in Film Industry

ఇదెలా ఉంటే.. గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కలకలం రేగుతోంది. వరుసగా ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీలో ప్రకంపనలు వెలువడుతున్నాయి. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన రిపోర్టు ఇవ్వడం. గత వారం టాలీవుడ్ లో జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా యువ నటుడు, యూబ్యూటర్ హర్ష సాయి పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఇండస్ట్రీలో ప్రకంపనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ పై నటి, యాంకర్ అనసూయ చేసిన షాకింగ్ కామెంట్ నెట్టింట్లో వైరలవుతున్నాయి.

యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..' ఈ గ్లామర్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ను తాను కొన్నిసార్లు ఎదుర్కొన్నాననీ, కానీ దాని నుంచి సులభంగా తప్పించుకోవచ్చని తెలిపింది. నటిగా ఎదిగే క్రమంలో కమిట్‌మెంట్ అనేది ఎక్కడోచోట ఎదురవుతుందని చెప్పింది. అయితే..తనను కమిట్‌మెంట్ అడిగిన సమయంలో ఎలా ప్రవర్తించాననే విషయాన్ని చెబుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఒక సినిమా గురించి చర్చించే సమయంలో ఎదుటివారి ఎలా ప్రవర్తిస్తున్నారో.. మనల్నీ ఏ ఉద్దేశం చూస్తున్నారో మొదటి రెండు లేదా మూడు నిమిషాల్లోనే అర్థమవుతుందని, వాళ్ళు ఏం ఆశిస్తున్నారో అర్థమతుందని యాంకర్ అనసూయ అన్నారు.

Anasuya Bharadwaj shocking Comments on Casting Couch in Film Industry

ఈ సమయంలోనే కొంచెం తెలియగా వ్యవహరించి ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేయాలని అన్నారు. తానైతే.. అలాంటి సమయంలో తన భర్త, పిల్లల గురించి మాట్లాడుతూ .. ఆ టాపిక్ మార్చేస్తానని తెలిపారు అనసూయ. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవ్వరినీ నొప్పించకూడదని, ఎవ్వరితో వివాదాలు పెట్టకుకోకుండా న్యూట్రల్ గా వెళ్లాలని పేర్కొంది. అబ్బాయిలు ట్రై చేస్తునే ఉంటారు వారి నైతం. కానీ అమ్మాయిలు సిగ్నల్ ఇస్తే చాలు మాత్రమే అలాంటి జరుగుతాయి. ముందుగానే ఒక్కసారి అంటే.. నో అంటే నో ఎవరు మన జోలికి రారు. తాను అలాంటి విషయాలు ఎదురైనప్పుడూ చాలా వ్యవహరిస్తూ టాపిక్ డైవర్డ్ చేస్తానని అన్నారు.

అలాంటి టైంలో తనని దొంగపిల్లా అని కామెంట్ చేసిన వారు కూడా ఉన్నారన్నారు. తనని చాలా మంది ప్లటింగ్ చేశారనీ, తాను కూడా ప్లటింగ్ చేస్తానన్నారు. కానీ,అవి మాటలకు పరిమితం అన్నారు. నేను మాట్లాడినా.. దిల్ దార్ గా మాట్లాడుతా.. ఓపెన్ గా ఓపినియన్ చేపేస్తానని యాంకర్ అనసూయ అన్నారు. ఇండస్ట్రీలో మహిళ ఆర్టిస్టులకు చాలా అవమానాలు జరుగుతున్నాయనీ, అమ్మాయిలకు పెళ్లయిపోయింది ఇండస్ట్రీకి పనికి రాదనే టాక్ కూడా ఉందని అన్నారు. కానీ తన విషయాల్లో అలాంటి అవమానాలు తను ఎదుర్కొలేదనన్నారు. ప్రతి విషయంలో మన ఓ లైన్ (నియంత్రణ) అనేది పెట్టుకోవాలని, ఆ లైన్ దాటకుండా చూసుకోవాలని అన్నారు యాంకర్ అనసూయ .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X