ముసుగులో గుద్దులాటలొద్దు.. కొత్త షోలో అనసూయ రచ్చ
స్టార్ యాంకర్ గా బుల్లితెరను కొన్నాళ్ల పాటు ఊపూపిన అనసూయ కొంతకాలం టీవీ ఆడియెన్స్ కు దూరమైన సంగతి తెలిసిందే. 'జబర్దస్త్' వేదిక ద్వారా యాంకర్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో గానో పరిచయం అయ్యింది. ఏకంగా పదేళ్ల పాటు ఆడియెన్స్ ను అలరించింది. తన యాంకరింగ్ స్కిల్స్, గ్లామర్ మెరుపులతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. 'జబర్దస్త్' కు గుడ్ బై చెప్పిన తర్వాత అనసూయ వెండితెరపై వరుస చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ అనసూయ మళ్లీ ఎప్పుడూ తిరిగి బుల్లితెరపై అడుగు పెడుతుందని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో అనసూయ స్మాల్ స్క్రీన్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మాలో మార్చి 29 నుంచి ప్రసారం అవుతున్న గేమ్ షో 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2' ద్వారా మళ్లీ బుల్లితెర ఆడియెన్స్, తన అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రతి శని - ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ఈ గేమ్ షో ప్రసారం కానుంది. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలుగా సాగే ఈ షో మొదటి సీజన్ ఎంతగానో విజయవంతం అయ్యింది. దీంతో 2వ సీజన్ ను మార్చి 29 నుంచి ప్రారంభించారు.

ఇక ఏప్రిల్ 18, ఏప్రిల్ 19కి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రోమో తాజాగా విడుదలైంది. అయితే ఈ ప్రోమోలో కటెస్టెంట్లకు ఒక టాస్క్ ఇస్తారు. సైకిల్ చేయడం ద్వారా జ్యూస్ తయారు చేయడం ఆ టాస్క్ లక్ష్యం. ఈ టాస్క్ లో అబ్బాయిలు ముందుగా జ్యూస్ చేస్తారు. అమ్మాయిలు కాస్తా ఆలస్యం చేస్తారు. కానీ మేమే ముందు చేశామని లేడీ టీమ్ పోరుకు దిగుతుంది. ఇక ఆ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న అనసూయ స్పందిస్తూ అమ్మాయిలు వినడం లేదు కాబట్టి వాళ్లకే విన్ ఇవ్వండి అని అంటుంది. దాంతో కంటెస్టెంట్ పృథ్వీ అనసూయపై ఫైర్ అవుతాడు.
అనసూయ ఇంకా సీరియస్ అవుతూ 'ముసుగులో గుద్దులాటొద్దు.. ఇక్కడ మేమంతా చూస్తున్నాం. అక్కడ ఏం జరిగిందే మీకు కూడా తెలుసు. అమ్మాయిలు కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి వారే విన్ ఇచ్చేయండి' అని అంటుంది. దీంతో పృథ్వీ అనసూయకు ఎదురుతిరుగుతాడు... ఆ తర్వాత ఘర్షణ ఎలా సద్దుమణిగిందనేది రేపటి ఎపిసోడ్ లో తేలనుంది. ఇక ఈ షోకు శేకర్ మాస్టర్ కూడా జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ గేమ్ షోలో మొత్తం 16 మంది సెలబ్రెటీలు పార్టీసీపేట్ చేశారు. ఎనిమిది మంది బాయ్స్, ఎనిమిది మంది గర్ల్స్ టీమ్ లతో ఆటలు నిర్వహిస్తారు.
మొదటి సీజన్ లో బాయ్స్ టీమ్ టైటిల్ ను గెలుచుకుంది. ఇక ఈ సారి ఎలాగైనా గర్ల్స్ టీమ్ టైటిల్ కొట్టాలని భావిస్తోంది. అందుకు బాయ్స్ తో పోటీపడి మరీ టాస్క్ లు ఆడుతున్నారు. ఈ షోలోని కిర్రాక్ బాయ్స్ టీమ్ లో.. బ్రహ్మముడి మానస్, బంచిక్ బబ్లూ, కాస్కో నిఖిల్, పృథ్వీ, శివ్ , జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, దిలీప్, సాకేత్ ఉన్నారు. ఇక ఖిలాడీ గర్ల్స్ టీమ్ లో బ్రహ్మముడి హమీదా, తేజస్విని మదివాడ, జబర్దస్త్ రోహిణి, సుష్మిత, లాస్య, శ్రీసత్య, దేబ్ జానీ, ఐశ్వర్య ఉన్నారు. కిర్రాక్ బాయ్స్ టీమ్ కు శేఖర్ మాస్టర్ సారథ్యం వహిస్తున్నారు. ఖిలాడీ గర్ల్స్ టీమ్ కు అనసూయ మద్దతుగా నిలుస్తోంది. స్టార్ యాంకర్ శ్రీముఖి రెండు టీమ్ ల మధ్య సమరాన్ని సాగిస్తోంది.


Click it and Unblock the Notifications











