ఇలాంటి విషెస్ మాత్రం ఎవ్వరూ చెప్పి ఉండరు.. భర్తపై ప్రేమను చాటిన అనసూయ

తెలుగు ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పి పరిచయం చేయనక్కర్లేదు. అది వెండితెర అయినా బుల్లితెర అయినా సరే అనసూయ అడుగు వేస్తే అదిరిపోవాల్సిందే. గ్లామర్ డాల్‌గానే కాకుండా నటనతో కంటతడి పెట్టించే సత్తా ఉన్న నటి అనసూయ. అలాంటి అనసూయకు బలమైన బలహీనతైనా ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్. ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది. నేడు సుశాంక్ బర్త్ డే సందర్భంగా అనసూయ షేర్ చేసిన ఫోటో చెప్పిన విషెస్ తెగ వైరల్ అవుతున్నాయి.

అలా మొదలైంది..

అలా మొదలైంది..


అనసూయది ప్రేమ పెళ్లి అన్న సంగతి తెలిసిందే. తాను ఎన్‌సీసీలో శిక్షణ తీసుకుంటుండగా.. సుశాంక్ పరిచయం అయ్యాడని, ఐ లవ్యూ అని కాకుండా పెళ్లి చేసుకుందామా? అని నేరుగా అడగడంతో ఫిదా అయినట్టు చెప్పింది. సుశాంక్ ప్రపోజ్ చేసిన విషయాన్ని నేరుగా తన అమ్మకే మొదట చెప్పానని పేర్కొంది. అలా ఓ నాలుగేళ్లు నాన్నకు తెలియకుండా మ్యానేజ్ చేశారట. కానీ ప్రేమ విషయం తెలియడంతో ఇంట్లోంచి వెళ్లిపో అన్నారట.

కష్టపడి సెటిల్ అయి..

కష్టపడి సెటిల్ అయి..


మా నాన్న ఒప్పుకోకపోయినా.. తొమ్మిదేళ్లు ఎదురుచూసి అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని అనసూయ తన ప్రేమ పురాణాన్ని వివరించింది. ఆ తొమ్మిదేళ్లలో ఎన్నో కష్టాలు అనుభవించానని, తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదని చెప్పుకొచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా తామిద్దరం ఓర్చుకున్నామని పేర్కొంది.

ఇంట్లో అలా..

ఇంట్లో అలా..


అనసూయ బయటకు మాత్రమే అలా రఫ్ అండ్ టఫ్‌లా కనిపిస్తుందట.. ఇంట్లో మాత్రం పిన్ను దొరక్కపోయినా ఏడ్చేస్తుందట. ఈ విషయాలన్నీ సుశాంక్ బయటపెట్టేశాడు. కానీ అనసూయ ఎంతో ధైర్యవంతురాలని, ఎంత మంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా నిలబడిందని ఎంతో గొప్పగా చెప్పాడు.

బర్త్ డే సెలెబ్రేషన్స్..

బర్త్ డే సెలెబ్రేషన్స్..


అనసూయ ఫ్యామిలీ ప్రస్తుతం టూర్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. నిన్న కారులో ఫ్యామిలీ అంతా బయటకు బయల్దేరింది. సుశాంక్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకునేందుకు వెకేషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తానికి భర్త బర్త్ డేను అనసూయ మంచి ప్లాన్ వేసి బాగానే సెలెబ్రేట్ చేసింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
క్యూట్ పిక్..

క్యూట్ పిక్..

తాజాగా అనసూయ తన భర్తపై ఉన్న ప్రేమను చాటేలా ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలోని నవ్వులే చెబుతున్నాయి..భర్తపై ఉన్న ప్రేమ ఏంటో. ఇక చిన్న పిల్లలా మారి వెరైటీ విషెస్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ హలో.. మై గ్రావిటీ.. మై నట్ బట్టర్ టు మై జెల్లీ.. అంటూ వింతగా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X