Anasuya: రంగమ్మత్తలో ఈ కళ కూడా ఉందా.. అనసూయ వీడియో వైరల్..
Anasuya bharadwaj:అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తోంది. అంతేకాకుండా తన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటో మీరు కూడా ఓ లూకేయ్యండి.
అనసూయ న్యూస్ రీడర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టింది. అనసూయ జీవితాన్ని మలుపుతిప్పింది జబర్ధస్త్ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ఈ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. క్రేజ్ లో సిల్వర్ స్కీన్ పై అవకాశాలు అందుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ అటు బుల్లి తెర, ఇటు వెండి తెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బుజ్జి అనే పాత్రతో ఈ అమ్మడుకు మంచి పాపులర్టీ వచ్చింది.

ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ థ్రిల్లర్ మూవీ క్షణంలో ఏసీపీ జయ క్యారెక్టర్ లో మెప్పించింది అనసూయ. సినిమా అనసూన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇక సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లో ఐటెం సాంగ్‌లో అందాలు ఆరబోసి తెలుగు ప్రేక్షకులకు చెమటలు పట్టించింది.ఆ తరువాత రంగస్థలం సినిమాలో అనసూయ నటించింది. ఇందులో రంగమ్మత్త అనే పాత్రకు జీవం పోసింది. ఇక అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించింది. ప్రస్తుతం పుష్ప 2 లో కూడా లీడ్ రోల్ నటిస్తోంది. అటు సినిమాల్లో నటిస్తూనే.. పలు షోలకు యాంకర్‌గా, జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఇక ఓ వైపు సినీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. తరుచు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియో డిఎస్పీ మ్యూజికల్ నైట్ కు సంబంధించిన వీడియో అని తెలుస్తోంది. ఇందులో అనసూయ స్టేజ్ పై పాట పాడుతూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది. రియల్ గా ప్రొఫెషనల్ సింగర్ లానే పాట పాడింది అనసూయ.
ఆ వీడియోని షేర్ చేస్తూ 'తనలోనే ఉన్న కలను మసకబారనివ్వ కుండా లేపుతున్నాననీ, స్టేజ్ పై పాడటానికి అవకాశమిచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు ప్రత్యేకతలు' అంటూ రాస్కొచ్చారు అనసూయ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అనసూయకు పాటలు పాడే కల కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన ఫ్యాన్స్. మరోవైపు తాను పుష్పట్టు సినిమాలో లీడ్రోలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర తన కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుందంటూ పలుమార్లు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











