‘అంతకు ముందు చీరలే కట్టుకోలేదా?'.. ట్రోల్స్‌కు అనసూయ స్ట్రాంగ్ రిప్లై..

టాలీవుడ్ బుల్లితెరపై తన యాంకరింగ్‌తో పాటు సినిమాల్లో నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). టెలివిజన్ షోలు, సినిమాలు, ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ ఇలా పలు రంగాల్లో బిజీగా ఉంటూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అనసూయ. సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

నెట్టింట్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్‌ను తిప్పికొడుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం తప్పుడు ప్రచారం, అర్థంలేని కామెంట్స్‌పై గట్టిగా స్పందిస్తూ తనదైన స్టైల్‌లో వార్నింగ్ కూడా ఇస్తారు. తాజాగా అలాంటి విషయంపై రియాక్ట్ అయిన అనసూయ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Anasuya Bharadwaj Slams Viral Saree Rumours Fires Back at Misleading Posts

ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తనపై వస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా స్పందించే అనసూయ, తాజాగా తన డ్రైస్సింగ్ (చీర)పై జరుగుతున్న ప్రచారంపై ఘాటు రియాక్ట్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల, మహిళ డ్రెస్సింగ్ పై సోషల్ మీడియా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి అనసూయకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోకు 'శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ'అనే థంబ్‌నైల్ పెట్టడం వివాదానికి కారణమైంది.

ఈ ప్రచారంపై అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ఎక్స్ వేదికగా ఆ వీడియోకు రిప్లై ఇస్తూ.."తప్పు తప్పు! 'శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ' ఇది కదా ఉండాలి హెడర్! ఎందుకంటే అంతకు ముందు మేమంతా అసలు చీరలే కట్టుకోలేదు కాదా? ఏంటమ్మా చూసుకోవాలి కదా పోస్ట్ చేసేముందు'అంటూ సెటైరిక్‌గా స్పందించారు. ప్రస్తుతం అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ రిప్లై ద్వారా తప్పుడు కథనాలను ఎత్తిచూపుతూ ట్రోల్స్ చేస్తున్న వారిపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు.

స్త్రీల డ్రెస్సింగ్ వివాదానికి మూలం.. గతంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలే. 2025 డిసెంబర్‌లో 'ధండోరా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మహిళల దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. "హీరోయిన్లు రివీలింగ్ డ్రెస్సులు తగ్గించి, సారీలు లేదా సంప్రదాయ దుస్తులు ధరించాలి" అని చెప్పడంతో అది మోరల్ పోలీసింగ్‌గా విమర్శలు ఎదుర్కొంది. ఈ వ్యాఖ్యలపై అనసూయ సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. అనసూయ అప్పట్లోనే 'ఇది నా శరీరం, నా ఇష్టం' అంటూ గట్టిగా స్పందించి మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

ఆ తరువాత శివాజీ క్షమాపణ చెప్పినా, ఈ అంశం పూర్తిగా చల్లారలేదు. ఈ విషయం మహిళ కమిషన్ వరకు కూడా వెళ్లి, ఈ విషయంపై హీరో శివాజీ తన వివరణ ఇచ్చారు. అయినా కూడా వివాదం ఎండ్ కాలేదు. తరుచు ఎవరొకరూ ఈ వివాదంపై మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు అనసూయ సారీలో కనిపించడంతో మళ్లీ ఈ వివాదాన్ని కొందరు సోషల్ మీడియాలో లేవనెత్తారు. అనసూయ తాజా వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారి తీశాయో లేదా ఇక్కడితో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడుతుందో వేచి చూడాలి.

Read more about: anasuya bhardwaj sivaji tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X