తగ్గేదేలే..అలా అయితే గుండు కొట్టించుకుంటూ.. నెటిజన్ కి అనసూయ షాకింగ్ ఆన్సర్..
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారు ఉండరు. ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ యాంకర్గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమె తన అభిమానులతో చేసిన ఒక సంభాషణ ఆసక్తికరంగా మారింది. అలా అయితే గుండు కూడా కొట్టించు కుంటాను అంటూ ఆమె హాట్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

అలా కెరీర్ మొదలు పెట్టి
అప్పుడెప్పుడో ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మాయమయిన అనసూయ తన చదువు పూర్తయిన వెంటనే ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది.. తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆమెకు మంచి అవకాశాలు రావడంతో అటు వైపు జంప్ అయ్యింది. అనూహ్యంగా జబర్దస్త్ అనే షోకి యాంకరింగ్ చేసే అవకాశం రావడంతో ఆమె దశ తిరిగిపోయింది.. తెలుగులో టాప్ యాంకర్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అనసూయకు జబర్దస్త్ ద్వారా అనేక సినిమా ఆఫర్లు కూడా లభించాయి.

అలా ఫేం రావడంతో
అందులో భాగంగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రకు గాను అనసూయ మంచి పేరు తెచ్చుకుంది. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అనసూయ తన నట విశ్వ రూపాన్ని చూపించడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి. అయినా సరే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళేది అనసూయ.

గుండు కొట్టించుకుంటా
తాజాగా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆస్క్‌మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన అనసూయ..అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. పెద్ద సినిమాలో మంచి రోల్ వస్తే.. అవసరం అయితే పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. దీనికి తప్పకుండా.. క్యారెక్టర్ కోసం అవసరం అయితే గుండు కొట్టించుకుంటా అంటూ అనసూయ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఆమె మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దాక్షాయణి లుక్ విడుదల
సినిమాల మీద అనసూయకు ఉన్న మక్కువ, కెరీర్ విషయంలో ఆమె డెడికేషన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఆస్క్‌మీ ఎనీథింగ్ సెషన్ లో ఆమె మరికొద్ది రోజుల్లో తాను తమిళ సినిమాల్లో కనిపించబోతున్నట్లు అనసూయ తెలిపింది. అంతేకాక ఆమె పుష్ప సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఆమె పాత్రను దాక్షాయణిగా పరిచయం చేస్తూ ఒక లుక్ విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
Recommended Video

చాలా ఆశలు
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ పాత్రలో నటించనున్నాడని అంటున్నారు..ఈ సినిమాలో విలన్ గా సునీల్ మంగళం శ్రీను అనే పాత్రలో నటిస్తూ ఉండగా ఆయన భార్య అయిన దాక్షాయణి అనే పాత్రలోనే అనసూయ నటిస్తోంది. ఈ సినిమా మీద అనసూయ అయితే చాలా నమ్మకాలు పెట్టుకుంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











