కొత్త షోకోసం చీరకట్టులో అనసూయ.. ఇంటర్నెట్ షేక్ చేస్తున్న ఫొటోలు
'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లితెరపై మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. దాదాపు దశాబ్దం పాటు టెలివిజన్ రంగంలో యాక్టివ్ గా పనిచేసింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో ఊపూపింది. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తన డ్యాన్స్ తో అనసూయ భరద్వాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో సినిమా ఆఫర్లను కూడా అందుకున్నారు.
తనకున్న డ్యాన్స్ స్కిల్స్ తో పూర్తిగా సినిమా పరిశ్రమలోకి జారుకుంది. దీంతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దూరమైపోయింది. వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుతుండటంతో ఇక యాంకరింగ్ కు కూడా గుడ్ బై చెప్పేసింది. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ తిరిగి బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టెలివిజన్ లో ప్రారంభమైన కొత్త గేమ్ షో 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2'లో తిరిగి దర్శనమిస్తోంది. ఈ షోకు జడ్జీగా వ్యవహరిస్తోంది. ప్రతి వారం శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ గేమ్ షో ప్రసారం కానుంది. స్టార్ మాలో ఈగేమ్ షోను వీక్షించవచ్చు.

మార్చి 29 నుంచి ప్రసారం అవుతున్న ఈ గేమ్ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ఏప్రిల్ 26, ఏప్రిల్ 27న స్టార్ మాలో ప్రసారం అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్స్ కోసం అనసూయ భరద్వాజ్ సరికొత్త లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. అదిరిపోయే డ్రెస్సుల్లో దర్శనమిస్తూ తన అభిమానులు ఫిదా చేస్తున్నారు. షోకు మరింతగా అందాన్ని తీసుకొస్తున్నారు. తన ఫ్యాషన్ సెన్స్ తోనూ యువతను కట్టిపడేస్తోంది.
ఇక తాజా ఎపిసోడ్ కు సంబంధించిన లుక్ ను ముందుగానే రివీల్ చేసింది. ఈసారి చీరకట్టులో కన్నుల విందు చేయబోతోంది. బ్యూటీఫుల్ ఎంబ్రాయిడింగ్, డిజైన్ వర్క్ తో మెరిసిపోతున్న శారీలో ఆకట్టుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కెమెరాకు ఫోజులిస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. తన బ్యూటీఫుల్ లుక్, ఆకర్షించే నవ్వు, ఆకట్టుకునే చూపులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా అనసూయ పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో పొగుడుతున్నారు. చీరలో దేవతలా ఉంటావంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
ఈషోలో అనసూయ తో పాటు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా జడ్జీగా వ్యవహరిస్తున్నారు. కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ గా రెండు టీమ్ లు టాస్క్ ల్లో పాల్గొంటాయి. గర్ల్స్ తరుపున అనసూయ భరద్వాజ్, బాయ్స్ తరుపున శేఖర్ మాస్టర్ తీర్పులిస్తూ ఉన్నారు. గత సీజన్ లో కిర్రాక్ బాయ్స్ టీమ్ టైటిల్ ను గెలుచుకుంది. ఈ సారి గర్ల్స్ టఫ్ ఫైట్ ఇస్తూ టైటిల్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. మొత్తం 16 మంది సెలబ్రెటీలు ఈ గేమ్ షోలో పార్టిసీపేట్ చేశారు. ఆసక్తికరంగా టాస్క్ లు ఆడుతున్నారు.


Click it and Unblock the Notifications











