ఆయనే నా ఫస్ట్ క్రష్.. అలాంటి వాళ్లంతా నా మీద పడి బతుకుతున్నారు.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్
జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరను అంద చెందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన అనసూయ.. వెండితెరపై తన నటనతో అం దర్నీ ఆకట్టుకుంది. రంగస్థలం, క్షణం లాంటి సినిమాలో అసాధారమైన నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలోనూ అభిమానులను పలకరిస్తూ హల్చల్ చేస్తోంది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది. అవేంటో ఓ సారి చూద్దాం.

వంటిట్లో గడిపేస్తున్నా..
ప్రస్తుతం ఈ క్వారంటైన్‌ను ఎలా గడుపుతున్నారని అడిగితే.. చాలా సమయం వంటింట్లోనే గడుపుతున్నానని తెలిపింది. దీనిమూలాన ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను, ఎలా చేయకూడదదో కూడా తెలుసుకుంటానని తెలిపింది.

ఫ్యామిలీతో సరదాగా..
మామూలుగా వీకెండ్స్‌లో షూటింగ్‌లకు వెళ్లనని చెప్పుకొచ్చింది. మరీ ఏదైనా అత్యవసరం అంటేనే వెళ్తాను లేదంటే వారాంతం పిల్లలు, భర్తతోనే గడిపేస్తానని తెలిపింది. కానీ ప్రస్తుతం రోజంతా ఇంట్లోనే ఉంటాను, ఈ క్వారంటైన్‌ను ఫ్యామిలీతో సరదాగా గడిపేస్తున్నానని పేర్కొంది.

ఫస్ట్ క్రష్ అతనే..
ర్యాపిడ్ ఫైర్ లాంటి ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలు ఇచ్చింది అనసూయ. మొదటి గిఫ్ట్ తండ్రి ఇచ్చాడని, మొదటి క్రష్.. ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ అని చెప్పుకొచ్చింది. బెస్ట్ ఫ్రెండ్ అంటే భర్తనేనని, ఇష్టమైన ప్రదేశాలు పర్వతాలు, బీచ్‌లని తెలిపింది.
Recommended Video

నా మీద పడి బతుకుతున్నారు..
ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ చేసేవారి గురించి చెబుతూ.. తానెమీ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేయనని, నెగెటివ్ కామెంట్స్ చేస్తూ వారే కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారని తెలిపింది. మొదట్లో నెగెటివ్ కామెంట్స్‌కు రెస్పాండ్ అయ్యేదాన్నని తరువాత మానేశానని చెప్పుకొచ్చింది. అయినా అలాంటి వారు నా మీద పడి బతుకుతున్నారంటే నాకు ఆనందంగా ఉందని పేర్కొంది.


Click it and Unblock the Notifications











