అనూహ్యంగా హ్యాండిచ్చిన తమన్నా, ఊహించని షాక్: మాస్టర్ చెఫ్ ను ఆదుకున్న టాలీవుడ్ టాప్ యాంకర్?
తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా భాటియా క్రేజ్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి. కొత్త భామల ఎంట్రీ సహా సరైన హిట్ సినిమాలు లేకపోవడం లాంటి అనేక అంశాలతో ఈ భామ వెనకబడింది. అయితే ఈ భామ ఇప్పుడు తెలుగులో ఒక టెలివిజన్ షో చేస్తోంది. అయితే ఆ షోకు రేటింగ్స్ రాని కారణంగా ఆమె స్థానం నుంచి ఆమెను తప్పిస్తున్నారని అంటున్నారు. ఆమె స్థానంలో ఒక స్టార్ యాంకర్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

అన్ని భాషల్లో
బాలీవుడ్ సినిమాలతో సినీ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తరువాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన ఆమె నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది. అయితే అక్కడ ఆమెకు పెద్దగా కలిసిరాకపోయినా ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, ఆ తదుపరి ఏడాది కేడీ సినిమాతో తమిళంలో అడుగు పెట్టింది. అలా తమన్నా ఇప్పటి దాకా దాదాపు 40 సినిమాల్లో నటించింది.

సూపర్ క్రేజ్
అయితే అన్ని తెలుగు, తమిళ సినిమాల్లో కూడా 2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత తమన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. రెడీ, 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబాలి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో చివరగా సీటీమార్ సినిమాలో నటించిన తమన్నా ఇప్పుడు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించడం లేదు.

డిజిటల్ ఎంట్రీ
అయితే ఆమె చేసిన లెవెంత్ హావర్ అనే తెలుగు సిరీస్ ఆహాలో స్ట్రీమ్ కాగా నవంబర్ స్టోరీస్ అనే మరో సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇవి కాకా మాస్టర్ షెఫ్ పేరుతొ తెలుగులో తమన్నా ఒక షో చేస్తోంది. మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఆమె రేంజ్ తగ్గిందని ఫీల్ అవకుండా ఆ షో చేసింది. అయితే ఈ షో రేటింగ్స్ అనసూయ కొంప ముంచాయని అంటున్నారు.

అనసూయ ఎంట్రీ
అందుకే ఇప్పుడు ఆమెను తప్పించి టాప్ యాంకర్ అనసూయను ఫైనల్ చేసారని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు మాస్టర్‌చెఫ్ తెలుగులో హోస్ట్‌గా తమన్నా భాటియా స్థానంలో అనసూయ భరద్వాజ్ బాధ్యతలు స్వీకరిస్తారని తాజా నివేదికలు నిర్ధారించాయి. ఇన్‌సైడర్ రిపోర్ట్‌లను పరిశీలిస్తే బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో అనసూయ ఇప్పటికే కొన్ని ఎపిసోడ్‌ల కోసం షూట్ కూడా చేసిందని అంటున్నారు.

తమన్నా షూట్ కి రాకవడంతో
తమన్నాను తప్పించానికి పూరి కారణాలు తెలియనప్పటికీ, కేటాయించిన కాల్ షీట్‌లో షెడ్యూల్ చేయబడిన ఎపిసోడ్‌లను చిత్రీకరించలేనందున తదుపరి షూటింగ్ కోసం ఆమె అందుబాటులో లేదని అందుకే ఆమె ప్లేస్ లో అనసూయను పెట్టి షూటింగ్ చేశారని అంటున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే మరి ఈ షో ఫినాలే కోసం అయినా తమన్నా తిరిగి వస్తుందో లేదో చూడాలి. మాస్టర్ చెఫ్ తెలుగుతోనే తమన్నా తెలుగు టీవీ అరంగేట్రం చేసింది. ఆమె ఇప్పటికే షోలో పోటీదారులు మరియు అభిమానులతో మంచి బంధాన్ని పెంచుకుంది.
Recommended Video

సరదా సరదాగా
మాస్టర్ చెఫ్ తెలుగు ఆగస్టు 27న ప్రారంభించబడగా ప్రతి శుక్రవారం మరియు శనివారం ఈ షో జెమినీలో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమానికి సంజయ్ తుమ్మ , చలపతిరావు మరియు మహేష్ పడాల న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అల్లు శిరీష్ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. హోస్ట్ తమన్నా భాటియాతో కలిసి సరదాగా 'దోస పోటీ'లో ఆయన పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











