అనసూయ హీరోయిన్‌గా ఎప్పుడు నటించింది? ట్రోలర్స్‌కు రంగమ్మత్త స్ట్రాంగ్ కౌంటర్

దండోరా ప్రీ రిలీజ ఈవెంట్‌లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం రేపుతూనే ఉన్నాయి. హీరోయిన్లు పద్ధతిగా చీరకట్టుకుంటేనే అందంగా ఉంటారని.. అంతే తప్పించి మోడ్రన్ డ్రెస్‌లలో అందాలు చూపించొద్దని ఆయన సున్నితంగా హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయి తదితరులు మండిపడ్డారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కొద్ది గంటల్లోనే శివాజీ క్షమాపణలు చెప్పారు. తాను చెప్పాలనుకున్నది ఒకటి.. ప్రజల్లోకి వెళ్లినది మరొకటి అని అన్నారు. నాలుగు మంచి మాటలు చెప్పే క్రమంలో రెండు తప్పుడు మాటలు నా నోటి నుంచి వచ్చాయని.. దీనిపై అంతా తనను క్షమించాలని శివాజీ అన్నారు.

శివాజీ ప్రెస్‌మీట్‌తో ముదిరిన వివాదం
అప్పటికి వివాదం ముగిసిపోయిందని అంతా భావించారు. అయితే ఆ మరుసటి రోజు.. తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. రాజా సాబ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌ను అభిమానులు చుట్టుముట్టి అసభ్యకరంగా తాకుతూ ఇబ్బంది పెట్టారు. సరైన వస్త్రధారణలో ఉండుంటే ఆ పరిస్ధితి వచ్చేది కాదన్న ఉద్దేశంలోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని శివాజీ పేర్కొన్నారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకొచ్చారు? ఆమెకు ఏం సంబంధం అని శివాజీ వ్యాఖ్యానించారు.

Anasuya Bharadwaj vs Sivaji Controversy Jabardasth Anchor Breaks Silence on Heroine Definition

నేను కూడా హీరోయిన్‌నే
దాంతో విషయం కాస్తా శివాజీ vs అనసూయగా మారిపోయింది. మీ సాయం నాకు అక్కర్లేదని.. పబ్లిక్‌ ఈవెంట్‌లో హీరోయిన్లపై పశువుల్లా పడుతున్న వారికి చెప్పాల్సిందిపోయి మాకు నీతులెందుకు చెబుతున్నారని అనసూయ వ్యాఖ్యానించారు. నేను కూడా కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా నటించానని అందుకే రియాక్ట్ అయ్యానని ఆమె తెలిపారు. నాటి నుంచి సోషల్ మీడియా, సినీ ప్రముఖులు రెండుగా చీలిపోయి ఒక వర్గం అనసూయకి, మరో వర్గం శివాజీకి సపోర్ట్‌గా నిలిచింది. మెగా బ్రదర్ నాగబాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌లు అనసూయకు మద్ధతుగా నిలిచారు.

మా మీద పడి బతుకుతారు
ఇదే వ్యవహారంలో తెలంగాణ మహిళా కమీషన్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ఇండస్ట్రీలో తనపై కుట్ర జరుగుతోందని, తనకు వ్యతిరేకంగా జూమ్ మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ హీరోయిన్ ఎప్పుడు అయ్యిందంటూ సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ నడుస్తోంది. న్యూఇయర్ వేడుకలు, ఇతర పనులతో బిజీగా ఉన్న అనసూయ కాస్త సైలెంట్ అవ్వగా.. నిన్నటి నుంచి మళ్లీ దూకుడు పెంచారు. కొన్ని పరాన్నజీవులు మా మీద పడి బతుకుతున్నాయంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

హీరోయిన్ అంటే ఎవరు?
తాజాగా తాను హీరోయిన్ ఎప్పుడు అయ్యానంటూ ట్రోల్ చేస్తున్న వారికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు అనసూయ. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. తనను ట్రోల్ చేస్తున్న వారి వీడియోలు పెట్టిన ఆమె... సరే ఈరోజు చిన్న ఎడ్యుకేషన్ క్లాస్ తీసుకుంటానని పోస్ట్ పెట్టారు. హీరోయిన్ అనే పదాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసి.. డిక్షనరీలో ఉన్న అర్ధాన్ని స్క్రీన్ షాట్ తీసి చూపించారు. హీరోయిన్ తెరపై కాదు... సత్యం మాట్లాడే ధైర్యం. సొంత దారి నడిచే శక్తి. సరైన దానికి నిలబడే గుండె. అదే నిజమైన హీరోయిన్. మిగతావాళ్లు కేవలం నటులు మాత్రమే. అందరూ చేస్తున్నారు కదా అని తప్పు ఎప్పుడు ఒప్పు అవ్వదు.. అలాగే సరైన దానిని ఎవ్వరూ ఫాలో కాకపోతే అది ఒప్పు కాకపోదు అని అనసూయ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద అనసూయ - శివాజీ వివాదం ఎక్కడో మొదలై.. ఎక్కడెక్కడో తిరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X