For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ జంతువులా పుట్టాలని ఉంది.. వాటి గొప్పదనం అదే.. అనసూయ షాకింగ్ కామెంట్స్

    |

    బుల్లితెరపై, వెండితెరపై సరిసమానమైన క్రేజ్‌ను సంపాదించుకుంది అనసూయ. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న అనసూయ తాజాగా తన మనసులోని విషయాలెన్నో పంచుకుంది.అలీతో సరదాగా షోలో పాల్గొన్న అనసూయ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలెన్నో చెప్పుకొచ్చింది. ఇక అనసూయ మాట్లాడిన మాటలు, ఆమె పడిన బాధలను విన్న ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు.

     ఎన్నో కష్టాలు..

    ఎన్నో కష్టాలు..

    చిన్నతనంలో అనసూయ ఎన్నో కష్టాలు పడింది. మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కళ్లారా చూసింది. యాభై పైసలను పొదుపు చేసేందుకు ఓ బస్టాప్ నుంచి మరో బస్టాప్ వరకు నడిచిన సందర్భాలున్నాయని తెలిపింది. అద్దె కట్టక ఎన్నోసార్లు ఇల్లు కూడా ఖాళీ చేశామని చెప్పుకొచ్చింది.

    వ్యక్తిగత జీవితంలో అలా..

    వ్యక్తిగత జీవితంలో అలా..

    తన భర్త సుశాంక్‌తో జరిగిన పరిచయం, వారిద్దరి ప్రేమను పెళ్లి పీఠల వరకు తీసుకురావడానికి పడిన కష్టాన్ని కూడా వివరించింది. దాదాపు తొమ్మిదేళ్లు ఎదురుచూసి చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహాం చేసుకున్నట్టు తెలిపింది.

    ట్రోలింగ్‌తో డిప్రెషన్‌లోకి..

    ట్రోలింగ్‌తో డిప్రెషన్‌లోకి..

    తనపై వచ్చిన, వస్తోన్న ట్రోలింగ్‌పై అనసూయ నోరు విప్పింది. కెరీర్ ప్రారంభంలో ట్రోలింగ్ వల్ల చాలా బాధ పడ్డాడని, డిప్రెషన్‌లోకి కూడా వెళ్లానని పేర్కొంది. అయితే ఆ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు అందరూ అండగా నిలబడ్డారని పేర్కొంది. ఇప్పుడు మాత్రం ట్రోల్స్‌ను ధీటుగా ఎదుర్కుంటున్నాని చెప్పుకొచ్చింది.

    బుల్లితెర తల్లి, వెండితెర నాన్న..

    బుల్లితెర తల్లి, వెండితెర నాన్న..

    బుల్లితెర తనకు తల్లి వంటిదని, వెండితెర అవకాశాలు అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి అంది నాన్న అంటూ అనసూయ తెలివిగా స్పందించింది. ఇక బుల్లితెరలో సుమ అమ్మ లాంటిది అని అలీ తండ్రి స్థానంలో ఉండే ఓ గురువు లాంటి వారని చెప్పుకొచ్చింది. ఇక మరో జన్మ ఉంటే ఏ జంతువులా పుడతావని అలీ సంధించిన ప్రశ్నకు అనసూయ ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది.

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
     ఆ జంతువులా పుట్టాలి..

    ఆ జంతువులా పుట్టాలి..

    ఏనుగులా పుట్టాలని ఉందంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఏనుగు జాతిలో వారి పార్ట్‌నర్స్ చనిపోతే.. మిగిలిన ఆ ఏనుగు తిండి తిప్పలు మానేసి చనిపోతుంది, వృద్దురాలైన ఆడ ఏనుగుకే కుటుంబ బాధ్యతలను చూసుకుంటుందట. అందుకే ఏనుగులా పుట్టాలని కోరుకుంటున్నానని అనసూయ తెలిపింది.

    English summary
    Anasuya Bharadwaj Wants To Born As Elephant. Anasuya shares greatness of Elephant. so she wants to born as Elephant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X