బుచ్చిబాబుకు అనసూయ వార్నింగ్.. నా విషయం ఏంటో తేల్చు అంటూ
బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి, యాంకర్ అసూయ భరద్వాజ్. దశాబ్దానికి పైగా టెలివిజన్ రంగంలో యాక్టివ్ గా ఉండి ఆడియెన్స్ ను అలరిస్తోంది. స్మాల్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత అసూయ భరద్వాజ్ వెండితెరపైనా కూడా మెరుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కొన్నాళ్లుగా అలరిస్తూ వచ్చింది. ప్రస్తుతం టీవీ షోల కంటే సినిమాలతోనే ఆకట్టుకుంటోంది. ఇప్పటికే గుర్తుండిపోయే పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే అనసూయ నెక్ట్స్ భారీ చిత్రంలో నటించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏకంగా డైరెక్టర్ కే వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
బుల్లితెరపై సెన్సేషన్..
అనసూయ భరద్వాజ్ తొలుత టీవీ యాంకర్ గా, న్యూస్ రీడర్ గా, హెచ్ఆర్ గా విధులు నిర్వహించింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. యాంకర్ గా తన స్కిల్స్ తో అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. యాంకరింగ్ స్కిల్స్, డ్యాన్స్, ఫ్యాషన్ సెన్స్, వాక్ చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీవీ రంగంలో సెన్సేషన్ గా మారింది. ఇక అనసూయకు జబర్దస్త్ ద్వారా సినిమా అవకాశాలు అందడంతో కొన్నాళ్ల కిందనే ఆ షోను వీడి సినిమాలకే ఫుల్ టైమ్ కేటాయించింది.

వెండితెరపై గుర్తుండిపోయే పాత్రలు..
అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ కామెడీ షోకు రాకముందే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆయా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఇక జబర్దస్త్ షోకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనసూయకు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం అవకాశం దక్కింది. సుప్రీమ్, సోగ్గాడే చిన్ని నాయనతో పాటు మరిన్ని చిత్రాల్లో అనసూయ భరద్వాజ్ స్పెషల్ సాంగ్స్ ల్లో నటించి మెప్పించింది.
రీసెంట్ గా హరి హర వీరమల్లు చిత్రం వరకు నాలుగైదు చిత్రాల్లో స్పెషల్ సాంగ్ తో అలరించింది. అందులో తనపేరుపైనే సూయ సూయ అనసూయ అని వచ్చిన సాంగ్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక క్షణం, రంగస్థలం, ఖిలాడీ, పుష్ప, పుష్ప 2, రంగమార్తాండా, రాజాకార్, పండుగాడ్, విమానం, పుష్పక విమానం, పెద్ద కాపు 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రాల్లో అనసూయ నటించిన పాత్రలన్నీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది.
బుచ్చిబాబుకు వార్నింగ్..
అనసూయ భరద్వాజ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబుకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపింది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమాలో తనకు సాలిడ్ రోల్ కావాలని ఏకంగా వార్నింగే ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా బుచ్చిబాబునే ఎందుకు రిక్వెస్ట్ చేసిందో కూడా చెప్పింది. బుచ్చిబాబు రాసు సినిమా కథలో లేడీ క్యారెక్టర్స్ బలమైన ప్రాధాన్యత ఉంటుందని, అందుకే తన కోసం పెద్ది సినిమా మంచి రోల్ రాయాలని చెప్పానని చెప్పింది. ఇక పెద్ది సినిమాలో అనసూయ ఉంటుందా? లేదా? అన్నది సప్పెన్స్ గా మారింది.


Click it and Unblock the Notifications











