హైపర్ ఆదికి అనసూయ వార్నింగ్: మంచం రెడీగా పెట్టు అనగానే కోపంతో!

తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ మంది మాత్రమే బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ అనే షో ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్‌లో హైపర్ ఆది.. అనసూయతో మంచం రెడీగా పెట్టు.. సాయంత్రం సిద్ధంగా ఉండు అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఆ సంగతులు మీ అందరి కోసం!

అలా మొదలైన కెరీర్.. ఇలా ప్రమోషన్

అలా మొదలైన కెరీర్.. ఇలా ప్రమోషన్

అప్పట్లో ఓ ఊపు ఊపేసిన డబ్‌స్మాష్ వీడియోలు, సినిమా స్ఫూఫ్‌లతో ఫేమస్ అయ్యాడు ఆది. ఆ సమయంలోనే ఈ వీడియోలను చూసిన అదిరే అభి.. అతడిని జబర్ధస్త్‌లోకి తీసుకొచ్చాడు. మొదట్లో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన అతడు.. ఆ తర్వాత ఆర్టిస్టుగానూ మెప్పించాడు. దీంతో హైపర్ ఆదిని టీమ్ లీడర్‌గా ప్రమోట్ చేశారు. అప్పటి నుంచి అతడు వెనుదిరిగి చూడడం లేదు.

హైపర్ ఆది కోసమే షో చూసేలా చేస్తూ

హైపర్ ఆది కోసమే షో చూసేలా చేస్తూ

తెలుగులో ప్రసారం అవుతోన్న సక్సెస్‌ఫుల్ షోలలో జబర్ధస్త్ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వాళ్లంతా తమదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. అయితే.. వాళ్లందరిలో తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్నాడు హైపర్ ఆది. అతడి కోసమైనా జబర్ధస్త్‌ను చూడాలి అనేటట్లుగా తన కామెడీతో నవ్విస్తూ సాగుతున్నాడు.

 షోలో అతడిదే హవా.. అక్కడ రికార్డులు

షోలో అతడిదే హవా.. అక్కడ రికార్డులు

హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వకముందు జబర్ధస్త్‌లోకి చాలా మంది టీమ్ లీడర్లు హవాను చూపించారు. కానీ, అతడు ప్రవేశించిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎవరు ఎన్ని రకాల స్కిట్లు చేసినా అతడినే విజయం వరించేది. మరీ ముఖ్యంగా హైపర్ ఆది చేస్తున్న స్కిట్లే ఎప్పుడూ ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఇప్పటికే ఈ కమెడియన్ ఖాతాలో పలు రికార్డులు చేరిపోయాయి.

 ఎవ్వరినీ వదలిపెట్టకుండా... రచ్చ చేస్తూ

ఎవ్వరినీ వదలిపెట్టకుండా... రచ్చ చేస్తూ

తన స్కిట్లలో హైపర్ ఆది ఎక్కువ శాతం సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. అలాగే, అద్భుతమైన టైమింగ్‌తో తన టీమ్ మెంబర్లపై పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టడు. ఇలా ఒకటే స్కిట్లో ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తుంటాడు. అందుకే అతడి స్కిట్లకు మంచి స్పందన వస్తోంది.

అనసూయతో హైపర్ ఆది రొమాంటిక్‌గా

అనసూయతో హైపర్ ఆది రొమాంటిక్‌గా

జబర్ధస్త్‌లో హైపర్ ఆది ఎవరో ఒకరిని గెస్టుగా తీసుకు రావడం పరిపాటి అయిపోయింది. వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ కోసం ముగ్గురు అమ్మాయిలను తన స్కిట్ కోసం తీసుకొచ్చాడు. వాళ్లతో పాటే యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను కూడా స్కిట్‌లో భాగం చేశాడు. ఈ క్రమంలోనే వాళ్లంతో పాటు ఈ యాంకర్ మీద కూడా రొమాంటిక్‌గా పంచులు వేస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు.

చంపుతానంటూ బెదిరించిన అనసూయ

తాజాగా విడుదలైన ప్రోమోలో.. తన స్కిట్‌లో హైపర్ ఆది ఏకంగా ముగ్గురు అమ్మాయిలతో కలిసి కనిపించాడు. ఇందులో అనసూయ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో 'ఉదయం నీతో బ్రేక్‌ఫాస్ట్ చేస్తా.. మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా' అన్నాడు. అప్పుడు అనసూయ వైపు చూస్తూ సాయంత్రం నీతో అనబోయే సరికి ఆమె చంపేస్తా అంది. దీనికి 'అందుకే మీతో ఏం చేయట్లా' అంటూ ఆది బదులిచ్చాడు.

 మంచం రెడీగా పెట్టు అంటూ రెచ్చిపోయి

మంచం రెడీగా పెట్టు అంటూ రెచ్చిపోయి

ఆ తర్వాత హైపర్ ఆది మాట్లాడుతూ.. అనసూయతో 'నువ్వు మంచం రెడీగా పెట్టు' అని అన్నాడు. అలాగే, డ్యాన్సర్ తేజస్వినితో 'నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు' అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న రోహిణి మరి నేనేం చేయాలని అడిగింది. దీనికి హైపర్ ఆది 'నువ్వు బయటకు వెళ్లి తలుపుకు గొళ్లెం పెట్టు' అంటూ పంచ్ వేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X