గూగుల్‌లో అనసూయ గురించి కుర్రాళ్లు ఏం వెతికారంటే? .. షాకైన జబర్దస్త్ బ్యూటీ!
అనసూయ భరద్వాజ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెలబ్రెటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిన మోస్ట్ వాంటేట్ నటిగా అనసూయ నిలిచారు. ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రంగమ్మత్త ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంటారు.
సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా ఉన్న సమయంలో జబర్దస్త్‌లో అవకాశం దక్కడం అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. రోజా, నాగబాబు వంటి స్టార్స్ ఉన్నప్పటికీ అనసూయ తన అందం, లుక్స్‌తో జబర్దస్త్‌కు ఆకర్షణగా మారారు. కమెడియన్ల స్కిట్‌లకు తోడు తను మధ్యలో వేసే పంచ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు అనసూయ. ఉత్తరాదికి చెందిన సుశాంక్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లాడారు ఈ స్టార్ యాంకర్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

కాలేజ్ రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడగా అనసూయను సుశాంక్ చదివించి, ఆమెకు అన్ని విషయాల్లో అండగా నిలిచారు. అనసూయ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక సుశాంక్ ప్రోత్సాహం ఎంతో ఉంది. అందుకే భర్త అంటే ఆమెకు పంచ ప్రాణాలు. తనకు ప్రజల్లో పేరుని, సెలబ్రెటీ స్టేటస్‌ను తీసుకొచ్చిన జబర్దస్త్ షోను అనసూయ విడిచిపెట్టడం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అనసూయ ఈ టాప్ షోను ఎందుకు వదులుకున్నారనే దానిపై నేటికీ స్పష్టమైన కారణం తెలియదు. కానీ ఎవరికీ నచ్చిన విధంగా వారు కథనాలు అల్లేసుకుంటున్నారు.
బుల్లితెరపై అడుగుపెట్టడానికి ముందే అనసూయ సినిమాలలో నటించారనే విషయం చాలా మందికి తెలియదు. 2003లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగాలో ఆమె కాలేజ్ విద్యార్ధినిగా కాసేపు కనిపించారు. ఆ తర్వాత చదువు, పెళ్లి, పిల్లలు, న్యూస్ రీడర్‌గా ఉండటంతో సినిమాలకు దూరమైన అనసూయ.. 2016లో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనలో నాగ్‌కు మరదలిగా ఆయనతో ఆడిపాడారు. ఈ పాటలో అనసూయ అందాలకు యూత్ ఫిదా అయిపోయారు. మధ్యలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
సుకుమార్ - అల్లు అర్జున్‌ల బ్లాక్ బస్టర్ సిరీస్ పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాల్లో ద్రాక్షాయణిగా విలన్ రోల్‌లో అదరగొట్టారు. నోట్లో కిళ్ళీ వేసుకుని చిత్తూరు యాసలో ఆమె చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. బుల్లితెరకు పూర్తిగా దూరమైన అనసూయ ఇప్పుడు తన ఫోకస్ సినిమాలపైనే పెట్టింది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లులో స్పెషల్ సాంగ్‌తోపాటు తమిళ్‌లో ఫ్లాష్‌బ్యాక్, వోల్ఫ్ సినిమాలలో అనసూయ నటిస్తున్నారు.
అనసూయ గురించి తెలుసుకోవడానికి యూత్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఓ షోలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు గూగుల్‌లో ఆమె గురించి ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలపై అనసూయను ఫన్నీగా ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులో అనసూయ రియల్ నేమ్ అని ఉండగా.. పుల్లమ్మ అని ఎవరికీ చెప్పలేదా అని ప్రదీప్ ఆటపట్టిస్తాడు. అనసూయ అడ్రస్ ఏంటీ అనే క్వశ్చన్‌కి గూగుల్ మ్యాప్ పెట్టుకుని, అనసూయ హోమ్ అని కొట్టండి వస్తుంది అంటుంది.
ఇక గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రశ్న ఏంటంటే అంటూ ప్రదీప్ ఓ క్వశ్చన్ ఓపెన్ చేస్తాడు. అందులో వాట్ ఈజ్ అనసూయస్ ఏజ్ అని ఉంటుంది. నాలాగే నిన్ను కూడా అడుగుతారు కదా అని ప్రదీప్‌ను రివర్స్‌లో ప్రశ్నిస్తుంది అనసూయ. నేను 16లో ఎలా ఉన్నానో, ఇప్పుడు అలాగే ఉన్నానని ప్రదీప్ ఆన్సర్ ఇస్తాడు. 50 వచ్చినా సరే అనసూయ కత్తిలా ఉందని అనుకోవాలి కదా అని రంగమ్మత్త అనేసరికి అంతా నవ్వుతారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











