అసలు రహస్యం ఇదన్నమాట.. ఈజీగా దొరికిపోయిన యాంకర్ అనసూయా.. ఫోటో వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనే పదానికి ఒక గ్లామర్ టచ్ ఇచ్చిన మొదటి యాంకర్ అనసూయ భరద్వాజ్ అనే చెప్పాలి. హోమ్లీ యాంకర్స్ మాటలతో ఆకట్టుకుంటే.. అనసూయ మాత్రం గ్లామర్ టచ్ తో ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఆమెకు ఒక స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ అందుతోంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లో వైరల్ అవుతోంది.

అనసూయా కోసమే చూస్తారట..
బుల్లితెరపై గేమ్ షోలతో కామెడీ షోలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ టీవీ రేటింగ్స్ పెంచడంలో చాలా కీలకంగా మారుతోంది. ఆమె కోసం స్పెషల్ గా ఎపిసోడ్స్ ని చూసే కుర్రాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా అనసూయ వేసే డ్రెస్ లకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమె డ్రెస్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

అసలు రహస్యం ఇదన్నమాట
ఇక అనసూయ కామెంట్స్ పై ఎంత వ్యతిరేకించినా కూడా ఓ వర్గం వారు ఆమె అందం గురించి మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ చేయరు. రంగమ్మత్తగా కుర్రాళ్ళలో ఆమె చాలా బలమైన ముద్ర వేసింది. ఇక ఆమె అందానికి అసలు రహస్యం ఏమిటనే విషయంలో ఆడియేన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇటీవల అనసూయ తన అమ్మ ఫొటో పోస్ట్ చేయడంతో అనసూయ దొరికిపోయింది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఆ ఫొటో ఎందుకు పోస్ట్ చేసిందంటే..
ఎందుకంటే అనసూయ వాళ్ళ అమ్మ పొలికలతోనే కనిపిస్తోంది. ఆమె చూడటానికి తల్లిలా లేదని నీకు అక్కలా ఉందని ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఆ ఫొటోను అనసూయ ఎందుకు పోస్ట్ చేసిందంటే.. అమ్మ అనురాధ పుట్టినరోజు సందర్భంగా విషెస్ అందిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ఐ లవ్ యూ అమ్మ. నువ్వు ఆరోగ్యంతో బావుండలని అలాగే నిత్యం నువ్వు మనశ్శాంతితో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు అనసూయ విష్ చేసింది.
Recommended Video

కంటతడి పెట్టిన అనసూయ..
ఇక ఇటీవల అలీతో సరదాగా షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ తనతల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పి కంటతడి పెట్టింది. ముగ్గురు ఆడపిల్లలు అయినప్పటికీ ధైర్యంగా మా కోసం నిలబడింది. జాకెట్లు, చీరలు కుట్టి మాకు బట్టలు కొనిచ్చేది. మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది. అందుకే నేను కూడా నా కాలేజ్ డెస్ లో డబ్బు పోదుపు చేయడం అలవాటుగా మార్చుకున్నాను.. అంటూ అనసూయ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











