Anasuya Bharadwaj షో రేటింగ్ దారుణంగా.. తమన్నాను తప్పించినా రుచించని వంట!

తెలుగు వినోద పరిశ్రమకు సంబంధించిన టాప్ హీరోలు, యాంకర్లు బుల్లితెరపై తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దికాలంగా టెలివిజన్ రంగంలో నెలకొన్న పోటీని తట్టుకొని మెరుగైన రేటింగ్‌ను సాధించేందుకు పలు ఛానెల్స్‌ను అగ్రహీరోలను రంగంలోకి దించుతున్నాయి. అయితే మిల్కి బ్యూటీ తమన్నాతో ఇటీవల ప్రముఖ ఛానెల్ ప్రారంభించిన వంటల కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం, ఆ కార్యక్రమం నుంచి తమన్నాను తప్పించడం వివాదాస్పదంగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే....

తమన్నాను తప్పించి అనసూయతో

తమన్నాను తప్పించి అనసూయతో

టాప్ హీరోయిన్ తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. అయితే కంటెంట్ సరిగా లేకపోవడంతో రేటింగ్ దారుణంగా పడిపోయిందనే విషయం టీఆర్పీలతో స్పష్టమైంది. దాంతో తమన్నాను తప్పించి టాప్ యాంకర్ అనసూయను తెరపైకి తీసుకొచ్చారు.

వివాదంలో మాస్టర్ చెఫ్

వివాదంలో మాస్టర్ చెఫ్

తనను తప్పించి అనసూయను మాస్టర్ చెఫ్ షోలోకి రప్పించడంపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. షో నిర్వాహకులు ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దాంతో ఈ షో వివాదంలో కూరుకుపోయింది.

మాస్టర్ చెఫ్ రేటింగ్ ఇలా క్షీణిస్తూ..

మాస్టర్ చెఫ్ రేటింగ్ ఇలా క్షీణిస్తూ..

ప్రస్తుత ఏడాది 37వ వారంలో ప్రారంభమైన మాస్టర్ చెఫ్ షో ఆరంభంలో మంచి టీఆర్పీని అందుకొన్నది. అర్బన్‌లో 3.65 రేటింగ్, 38వ వారంలో 2.23, 39వ వారంలో 1.81 రేటింగ్, 40వ వారంలో 1.29, 41వ వారంలో 1.36 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 37వ వారంలో 2.21, 38వ వారంలో 1.49, 39 వారంలో 1.38, 40వ వారంలో 1.12, 41వ వారంలో 1.11, 42వ వారం అర్బన్‌లో 1.46, రూరల్‌లో 1.24 రేటింగ్‌తో దారుణమైన టీఆర్సీ నమోదు చేసుకోవడం కనిపించింది.

43వ వారంలో కూడా మారని పరిస్థితి

43వ వారంలో కూడా మారని పరిస్థితి

అయితే తమన్నాను తప్పించి అనసూయను తెరపైకి తెచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. 43వ వారంలో కూడా టెలివిజన్ రేటింగ్ క్షీణిస్తూనే కనిపించింది. గతంలో కంటే తక్కువ రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. తాజా టీఆర్పీ ప్రకారం.. 43వ వారం 1.31 అర్బన్ ప్రాంతంలో, 0.99 రేటింగ్ రూరల్‌లో నమోదు చేసుకొన్నది.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
అనసూయ టాప్ రేపుతుందా?

అనసూయ టాప్ రేపుతుందా?

అయితే అనసూయ భరద్వాజ్ మాస్టర్ చెఫ్ షోలోకి వచ్చి కొద్ది రోజులే అవుతున్నది కనుక.. ఇప్పుడే ఆమె టాలెంట్‌ను ఈ షో విషయంలో అంచనా వేయలేం. కొన్ని షోలను అనసూయ ఒంటి చేత్తో టాప్ రేటింగ్‌కు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో మాస్టర్ చెఫ్ రేటింగ్‌ను రంగమ్మత్త మెరుగు పరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X